జ్యోతిష్యం : 30 ఏళ్ల తర్వాత మీన రాశిలోకి శని, సూర్యుడు.. రాబోయే 2 నెలలు ఈ రాశుల వాళ్లు జాగ్రత్త..!

జ్యోతిష్యం : 30 ఏళ్ల తర్వాత మీన రాశిలోకి శని, సూర్యుడు.. రాబోయే 2 నెలలు ఈ రాశుల వాళ్లు జాగ్రత్త..!

తెలుగు సంవత్సరం .. విశ్వావశు నామ సంవత్సరం చివరి రోజుల్లో .. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మార్చి 14న ఒక ప్రత్యేక గ్రహాల సంయోగం జరగబోతోంది. ఆ రోజున సూర్యుడు  మీన రాశిలోనికి ప్రవేశిస్తాడు. అప్పటికే అదే రాశిలో శని భగవానుడు , శని కలయిక ఏర్పడుతుంది.  30 సంవత్సరాల తరువాత  మీనరాశిలో సూర్యుడు.. శని కలిసి సంచారం చేయబోతున్నారని  పండితులు చెబుతున్నారు. దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది.  సూర్యుడిని ఆత్మవిశ్వాసం, నాయకత్వం, ప్రతిష్టకు చిహ్నంగా ఉంటాడు.  శని  కర్మ ఫలితాలను కలుగజేస్తాడు. ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  .!

మేష రాశి:  మీనరాశిలో సూర్యుడు.. శని  కలవడం వలన ఈ రాశి వారికి ఆదాయం పెరిగినా.. దానికంటే ఎక్కువుగా ఖర్చులు పెరుగుతాయి.శత్రువులు.. నమ్మక ద్రోహులు చెడు చేసే అవకాశం ఉన్నందున వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.    ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.  విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు.పాత స్నేహితులను వదిలి కొత్తవారితో స్నేహం చేస్తారు. అనవసర పరిచయాలు ఏర్పడటంతో సమాజంలో కొన్ని అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడతారు.  వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.   ఓర్పు .. సహనాన్ని పాటించండిఎలాంటి ఆదోళన చెందవద్దు కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. 

వృషభరాశి : మీనరాశిలో సూర్యుడు.. శని కలవడం వలన ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడటంతో .. మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది.  ఊహించని సంఘటనలే చోటు చేసుకుంటాయి.  నిరుద్యోగులు ఉద్యోగం లభిస్తుంది.  ఆర్థికంగా స్థిరత్వం లభించడంతో పాటు.. మీ ప్రేమ పెళ్లి పెద్దల అంగీకారంతో జరుగుతుంది.  విదేశాల్లో జాబ్​ ట్రై చేసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.  అయితే అనుకోకుండా కొన్ని చెడు వార్తలు వినే అవకాశాలున్నాయి. ఉద్యోగం మరియు వ్యాపారంలో మీరు కొన్ని మంచి అవకాశాలను పొందుతారు. స్నేహితులు, పరిచయస్తుల సహాయంతో కొంత పనులను పూర్తి చేయవచ్చు. ఆర్థిక విషయాల్లో పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. 

మిథునరాశి :ఈ  రాశి వారికి సూర్యుడు.. శని కలవడం వలన చాలా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. .  చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు  పూర్తవుతాయి.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  ఆర్థికంగా ఇబ్బందులు పరిష్కారమవుతాయి. . ఉద్యోగం లేదా వృత్తిలో పురోగతి కనిపించవచ్చు. విద్యార్థుల విషయంలో కూడా ఇది అనుకూల సమయంగా భావిస్తున్నారు. వారు చదువులో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. సమాజంలో గౌరవం మరియు గుర్తింపు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా ఆకస్మిక లాభాలు పొందే అవకాశం ఉందని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.

కర్కాటకరాశి :ఈ రాశి వారికి  అనుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.  విదేశాలకు వెళ్లాలనుకొనే వారికి అనుకూల పరిణామాలు ఏర్పడుతాయి కాని.. సాంకేతిక కారణాలతో వెళ్లలేరు. ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో తిరిగి రాని బాకీలు ..  పెండింగ్ లో ఉన్న డబ్బుచేతికి అందుతుంది.వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది.   అనుకున్న పనులు సమయానికి పూర్తవడంతో కుటుంబంలో ఆనందం పెరిగే పరిస్థితి ఉంటుంది. 

సింహ రాశి :  రెండు కీలక గ్రహాలైన సూర్యుడు..శని   మీనరాశిలో కలవడం వలన ఈ రాశి వారు విదేశీయులతో ప్రేమలో పడే అవకాశం ఉంది.  విలాసవంతమైన జీవితం గడుతారు.  ప్రేమ వివాహం జరిగేందుకు అవకాశాలున్నాయి.  సరదాలకు.. సంతోషాలకు డబ్బును ఖర్చు చేస్తారు. అయితే ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆఫీసులో  సహనం పాటించడం చాలా  అవసరం. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. దంపతులు విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పరిచయాల వల్ల చెడు జరుగుతుందని పండితులు అంటున్నారు. 

కన్య రాశి :ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సూర్యుడు.. శని  ఈ రెండు గ్రహాలు కలిశాయి.  దీనివలన అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. వీరి జీవన విధానంలో అనుకోకుండా మార్పులు సంభవిస్తాయి.  వివాహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.   వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోకపోతే నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు మిత్రుల మాటలు విని వ్యసనాలకు బానిసయ్యే  అవకాకాశాలున్నందున చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

తులా రాశి : ఈ రాశి వారికి మీన రాశిలో సూర్యుడు.. శని కలవడం వలన వీరి జీవితంతో అనుకోనివి జరుగుతాయి.  ఆకస్మికంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత.. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. జీవన విధానంలో మార్పులు జరుగుతాయి.  కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు తీసుకొనే అవకాశాలున్నాయి.  విలాసాలకు.. వ్యసనాలకు డబ్బును అధికంగా ఖర్చు చేస్తారని పండితులు చెబుతున్నారు. 

వృశ్చికరాశి :  మీన రాశిలో సూర్యుడు.. శని కలవడం వలన ఈ రాశి వారికి  ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి,  ఆరోగ్యం సహకరించదు. ఆర్థిక పరిస్థితి అస్సలు అనుకూలించదు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదంటున్నారు పండితులు.

ధనుస్సురాశి : ఈ రాశి వారికి సూర్యుడు.. శని  కలయిక మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఈ రాశి   ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటివరకు చకచకా జరిగిన పనులు కూడా అడ్డంకుల వల్ల ఆలస్యమవుతాయి. ఇతరులతో మాట పడాల్సి వస్తుంది. వైవాహిక జీవితం, భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు .

మకరరాశి :ఈ  రాశి వారికి  సూర్యుడు..శని  కలయిక శుభప్రదం కాదు. దీనివలన  ఖర్చులు, నష్టాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిరాశ పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతి పనిలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పై అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాలకు సంబంధించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి :సూర్యుడు.. శని మీనరాశఙలో సంచరించడం  ఉండటం వలన ఈ రాశి వారికి రాజయోగం పట్టే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులకు బాగా అనుకూలంగా ఉంటుంది.  వేతనం పెరగడం.. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్​ రావడం.. కావలసిన ప్రదేశానికి ట్రాన్సఫర్​ అయ్యే అవకాశం ఉంది.  నిరుద్యోగులకు విదేశాల్లో జాబ్​ లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు వృద్ది చెందుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు.  కొత్త పెట్టుబడులు పెట్టేందుకు.. బిజినెస్​ ను విస్తరించే అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.

మీనరాశి: ఇదే రాశిలో సూర్యుడు.. శని కలవడం వలన ఈ రాశి వారి  జీవితంలో ఒక కొత్త దిశను తీసుకురావచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో చేసే పనుల్లో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. చదువుతున్న విద్యార్థులు కూడా సంతోషకరమైన ఫలితాలను చూడవచ్చని చెబుతున్నారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉండవచ్చని చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.