ఎవరూ చనిపోవాలని కోరుకోరు...అయినప్పటికీ మరణమే మన గమ్యం. ఎవరూ దాన్నుంచి తప్పించుకోలేరు' అన్నాడు యాపిల్ సంస్థ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఓసారి. అన్నింటికంటే చెడ్డ భయం ఏదైనా ఉందంటే అది మరణం తాలూకు భయమే! 'మనం పుట్టాం.. ఏదో ఒక రోజు కచ్చితంగా చనిపోతాం' అని తెలిసికూడా కాన్షియస్ గానో, అన్ కాన్షియస్ గానో చావు తాలూకు భయం లోలోపల గూడు కట్టుకొని ఉంటుంది.
చావు, పుట్టుకలు ఒకే కాయిన్ కి రెండు వైపులుండే బొమ్మా బొరుసులాంటివి. కృష్ణుడు భగవద్గీత బోధిస్తూ.. అర్జునుడికి సాంఖ్య యోగం చెప్తున్నప్పుడు ఈ చావు-పుట్టుకల గురించి చెప్తాడు. మనం చావు గురించి లోతుగా తెలుసుకుంటే... దాని గురించి భయపడం. కానీ, మన చుట్టూ ఉన్న అస్థిరమైన వాటి గురించి ఆందోళన చెందినంత కాలం.. చావు భయపెడుతూనే ఉంటుంది.
మనతో ఎమోషనల్ ఎటాచ్ మెంట్ ఉన్న వ్యక్తి సడెన్ గా చనిపోతే.. మన హృదయం ముక్కలవుతుంది. అలా కాకుండా చావుకు కారణమైన ముసలితనం, అనారోగ్యం వంటి విషయాలు ముందే తెలిస్తే మాత్రం దాన్ని ఫేస్ చేయడానికి మనం ముందే మెంటల్ గా ప్రిపేర్ అవుతాం.
అందుకే, “చనిపోయినవారి కోసమూ, బతికున్న వారికోసం జ్ఞానులు దుఃఖించరు' అని ఒక గొప్ప సలహా ఇస్తాడు. "ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ చనిపోదు. మళ్లీ పునర్జన్మ ఉంటుందని చెప్తాడు.
మన పునర్జన్మ అనేది మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది.
మనం ఈ జన్మలో చేసిన పనులే దీనికి కొలమానం. అందుకే కొంతమంది బతికుండగానే చనిపోతారు. మరికొంతమంది చనిపోయి జీవిస్తుంటారు అంటారు దలైలామా. ఒకవేళ మనం చనిపోవాలని కోరుకుంటే.. మనం మంచిగా బతకడం ఎలాగో కచ్చితంగా నేర్చుకోవాలి! ప్రశాంతమైన చావుని ఆశిస్తే.. ముందు మన మనసుని ప్రశాంతంగా మార్చుకోవాలి. ఆ ప్రశాంతతే జీవితాన్ని కొనసాగిస్తుంది.
వెలుగు,లైఫ్
