భారత్ నౌకలపై అమెరికా సైన్యం దాడి చేసిందని వస్తున్న వార్తలపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆ దాడులు చేసింది మేం కాదు.. ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది.. ఇరాన్ దాడులను మేం అడ్డుకున్నామని ప్రకటించారు ట్రంప్. అంతేకాదు.. యుద్దం ముగించేందుకు ఇరాన్ ,అమెరికా మధ్య ఒప్పందంపై ఇరాన్ ఫేక్ ప్రచారాన్ని ట్రంప్ ఖండించారు. రెండు దేశాల మధ్య ఎటువంటి యుద్ద విరమణ ఒప్పందంలో ఉన్న వాస్తవఅంశాలకు, ఇరాన్ ప్రచారం చేస్తున్న వాటికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇరాన్ తో చర్చలు జరపడమంత నీచమైన పని లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకపై వారితో మంచితనంతో నడుచుకోవడం జరగదని తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో ఓ పోస్టును షేర్ చేశారు ట్రంప్.
►ALSO READ | ఇండియా నుంచి ఎండు మిర్చి కొనొద్దు.. మిర్చి రైతులకు, వ్యాపారులకు చైనా షాక్
హార్ముజ్ జలసంధిని దాటుతున్న భారత నౌకలపై దాడి చేసింది మేం కాదు.. ఇరాన్ డ్రోన్లు దాడి చేస్తుంటే మేం అడ్డుకున్నాం... భారత్ నౌకలపై ఇరాన్ దాడులను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇలాంటి చర్యలు ఇరాన్ ఇప్పటికేనా మాను కోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ రాశారు. మరో వైపు ఒప్పందంపై ఇరాన్ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోంది.. ఒప్పందంలో వాస్తవఅంశాలు వేరు.. ఇరాన్ ప్రచారం చేస్తున్న వాటిలో నిజం లేదు.. వారితో చర్చల జరపడం కూడా వృధా.. వారిలో నిజాయితీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
