పాక్‎తో చర్చలంటే కేవలం పీవోకే పైనే.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్

పాక్‎తో చర్చలంటే కేవలం పీవోకే పైనే.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్

ద్రాస్: ఉగ్రవాదాన్ని తన ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్‌‌‌‌తో ఇకపై ఎలాంటి చర్చలు జరిపినా అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించేనని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అది అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగమేనని తేల్చిచెప్పారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్‎లోని ద్రాస్ కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఆదివారం ఆయన నివాళులర్పించారు. 

అనంతరం రాజ్​నాథ్ మాట్లాడుతూ.. భారత్‌‌‌‌పై దాడి చేయాలని చూస్తే ఏంజరుగుతుందో ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ఇప్పటికే నిరూపించామని గుర్తుచేశారు. 1999 కార్గిల్ విజయం భారత్‌‌‌‌ ముఖచిత్రంలో ఒక వజ్రం లాంటిదని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్, లడఖ్​ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.