ఆఫ్ఘన్‌తో తొలి వన్డే.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనా?

ఆఫ్ఘన్‌తో తొలి వన్డే.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనా?

India vs Afghanistan ODI Series: 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే భారత జట్టు సన్నాహాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది. రేపు (శనివారం) ధర్మశాల వేదికగా ఫస్ట్ వన్డే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే రెండు టీమ్స్ ధర్మశాల చేరుకుని నెట్స్‌లో ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక గాయాల వల్ల స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు ఈ సిరీస్‌కు దూరం కావడం ఫ్యాన్స్‌కు కొంచెం షాక్ ఇస్తుంది. కోహ్లీ ప్లేస్‌లోకి యశస్వి జైస్వాల్ రాగా.. హార్దిక్ రిప్లేస్‌మెంట్‌ను ఇంకా బీసీసీఐ అనౌన్స్ చేయలేదు.

మూడేళ్ల తర్వాత ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీ:
ఓపెనర్లుగా ఎప్పటిలాగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లు ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నారు. అయితే విరాట్ కోహ్లీ లేకపోవడంతో.. మోస్ట్ అవేటెడ్ వన్-డౌన్ (3వ స్థానం) పొజిషన్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. కిషన్ లాస్ట్ టైమ్ అక్టోబర్ 2023లో ఇదే ఆఫ్ఘన్‌పై వన్డే ఆడాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత వన్డేల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చి రచ్చ లేపడానికి రెడీ అయ్యాడు. అలాగే బ్యాకప్ ఓపెనర్‌గా వచ్చిన జైస్వాల్ మాత్రం బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఎందుకంటే అతడు కేవలం ఓపెనింగ్ మాత్రమే చేయగలడు, కాబట్టి రోహిత్ లేదా గిల్‌కు రెస్ట్ ఇస్తే తప్ప మనోడికి తుది జట్టులో ఛాన్స్ దక్కడం కష్టమే.. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు రానున్నారు.

ఆల్‌రౌండర్ కోటాలో నితీష్: 
హార్దిక్ పాండ్యాకు తొడ కండరాల గాయం (Hamstring Injury) కావడంతో.. ఆల్‌రౌండర్ కోటాలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఫిక్స్ అయింది. ఈ మ్యాచ్‌లో నితీష్ బ్యాటింగ్‌తో పాటు తన 10 ఓవర్ల బౌలింగ్ కోటాను కూడా పూర్తిగా వేయాల్సి ఉంటుంది. మరో ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ టీమ్‌లో కొనసాగనుండగా.. మెయిన్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ మాయ చేసేందుకు రెడీ అవుతన్నాడు. 

►ALSO READ | ఐర్లాండ్లో తీవ్ర ఉద్రిక్తత.. వైభవ్ సూర్యవంశీ డెబ్యూ వాయిదా?

ప్రిన్స్ యాదవ్ వన్డేలోకి అరంగేట్రం?: 
ఈ మ్యాచ్ ద్వారా ప్రిన్స్ యాదవ్ టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం (Debut) చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ప్రిన్స్.. తన యార్కర్లతో 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి సెలెక్టర్ల కంట్లో పడ్డాడు. బుమ్రా, సిరాజ్ లాంటి సీనియర్ పేసర్లు ఈ సిరీస్‌లో లేకపోవడంతో.. ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి రావడం పక్కా.. ఈ యువ యార్కర్ కింగ్.. అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణలతో కలిసి పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు.

టీమిండియా తుది జట్టు అంచనా: 
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్