Ireland Violence: దేశవాళీ మ్యాచుల్లో సెంచరీలతో దుమ్ములేపి, ఐపీఎల్‌లో కూడా తన పవరేంటో చూపించిన 15 ఏండ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) టీమిండియా నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అతి పిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికై హిస్టరీ క్రియేట్ చేసిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం భారత్ 'ఎ' జట్టుతో కలిసి శ్రీలంక టూర్‌లో ఉన్నాడు. దీని తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరగబోయే టీ20 సిరీస్‌లలో వైభవ్ ఆట చూడాలని ఫ్యాన్స్ మస్తు వెయిట్ చేస్తున్నారు. కానీ, సూర్యవంశీ ఇంటర్నేషనల్ అరంగేట్రం (Debut) కాస్త లేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఐర్లాండ్‌లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
బెల్ఫాస్ట్‌లో కత్తితో దాడి.. లోకల్ మ్యాచులు క్యాన్సిల్:
షెడ్యూల్ ప్రకారం భారత్ వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య బెల్ఫాస్ట్ వేదికగా రెండు టీ20 మ్యాచ్‌లు జరగాలి. కానీ, ఈ వారం స్టార్టింగ్‌లో బెల్ఫాస్ట్ సిటీలో ఒక ఘోరమైన కత్తి దాడి (Knife Attack) జరిగింది. అక్కడ పరిస్థితులు అదుపు తప్పడంతో ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆల్రెడీ జరగాల్సిన 'ఇంటర్ ప్రావిన్షియల్ టీ20 ఫెస్టివల్' ను రద్దు చేసింది. ఆదివారం నుంచి జరగాల్సిన ఐరిష్ సీనియర్, నేషనల్ కప్ కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే చెప్తామని బోర్డు ప్రకటించింది. అక్కడ ఇంకా పరిస్థితులు సద్దుమణగకపోవడంతో.. ఇప్పుడు భారత్‌తో జరగబోయే సిరీస్ కూడా ప్రమాదంలో పడింది.
బీసీసీఐ ప్లాన్.. మ్యాచ్‌లు వేరే దగ్గరకి షిఫ్ట్?:
ప్రస్తుతం క్రికెట్ ఐర్లాండ్ అధికారులు అక్కడి పోలీస్ కంట్రోల్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బీసీసీఐ (BCCI) కూడా ఈ గొడవపై కన్నేసి ఉంచింది. ఒకవేళ బెల్ఫాస్ట్‌లో గొడవలు తగ్గకపోతే.. సిరీస్ క్యాన్సిల్ చేయకుండా మ్యాచులను సేఫ్ ఏరియాకు షిఫ్ట్ చేసే ప్లాన్ కూడా నడుస్తోంది. ఇదే జరిగితే 15 ఏండ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ సిరీస్‌లోనే ఇండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్‌లోకి దిగుతాడు.
ఒకవేళ ఐర్లాండ్ సిరీస్ రద్దైతే:
ఒకవేళ ఐర్లాండ్‌లో పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోతే.. ఆ సిరీస్ పూర్తిగా రద్దైతే మాత్రం.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ జూలైకి పోతుంది. ఇంగ్లాండ్‌తో జూలై 1 నుంచి ఐదు టీ20ల సిరీస్ స్టార్ట్ కానుంది. ఆ సిరీస్‌లో మాత్రం వైభవ్ పక్కాగా బరిలోకి దిగుతాడు.
భారత్ - ఐర్లాండ్ టీ20 షెడ్యూల్:
* జూన్ 26న బెల్ఫాస్ట్ వేదికగా ఫస్ట్ మ్యాచ్
* జూన్ 28న బెల్ఫాస్ట్ వేదికగా సెకండ్ మ్యాచ్
🚨 India-Ireland series might be cancelled:
— Indian Cricket Ministry (@ICM_News45) June 12, 2026
Ireland is currently facing massive unrest following a controversial stabbing case. Major protests and violent riots have been reported in Northern Ireland.
Cricket Ireland issued a statement mentioning that a decision regarding the… pic.twitter.com/udxTdCR1Dj
