ఖానాపూర్‎ పోచమ్మ ఆలయంలో అర్థరాత్రి చోరీ.. అమ్మవారి నగలు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

ఖానాపూర్‎ పోచమ్మ ఆలయంలో అర్థరాత్రి చోరీ.. అమ్మవారి నగలు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

రంగారెడ్డి జిల్లా ఖానాపూర్‎లోని పోచమ్మ దేవాలయంలో చోరీ తీవ్ర కలకలం రేపింది. సోమవారం (జులై 27) అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి వెండి ఆభరణాలు, హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు చిక్కకుండా ఆలయంలోని సీసీటీవీ వైర్లు కత్తించారు. ఆధారాలు దొరక్కుండా డీవీఆర్ సైతం మాయం చేశారు దుండగులు. 

ఆలయంలో చోరీపై గ్రామ ఆలయ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆలయంలో చోరీ తెలిసిన వారి పనేనని గ్రామ ఆలయ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. ఆషాఢమాస బోనాల వేళ ఆలయంలో చోరీ ఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.