హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన రిజిడ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కంపెనీ మోల్డ్-టెక్, ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ.25.57 కోట్ల నికర లాభం సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.22.40 కోట్లుగా నమోదైంది. ఆదాయం 24.9శాతం పెరిగి రూ.300.45 కోట్లకు చేరగా, ఇబిటా (వడ్డీలు, ట్యాక్స్‌ల ముందు ప్రాఫిట్) 19.1శాతం పెరిగి రూ.56.43 కోట్లకు చేరుకుంది.
యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో మోల్డ్-–టెక్ అద్భుత ఫలితాలు సాధించిందని కంపెనీ చైర్మన్ జె. లక్ష్మణరావు అన్నారు. ఫార్మా ప్యాకేజింగ్ విభాగం నుంచి అధిక ఆదాయం వచ్చిందని తెలిపారు.
