హైదరాబాద్, వెలుగు: నిస్సన్ మోటార్ ఇండియా తన సరికొత్త ప్రీమియం -ఎస్‌యూవీ 'నిస్సన్ టెక్టాన్' గ్లోబల్ లాంచ్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చేపట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.49 లక్షలు. ఈ ఎస్‌యూవీలో 100శాతం టర్బోచార్జ్డ్ ఇంజిన్ లైనప్, గూగుల్ బిల్ట్-ఇన్ కనెక్టివిటీ, క్లాస్-లీడింగ్ 700 లీటర్ల బూట్ స్పేస్ వంటి ప్రత్యేకతలున్నాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటీనటులు శ్రావంతి చోకారపు, గీతానంద్, మానస్ తదితరులు పాల్గొన్నారు. చెన్నై ప్లాంట్‌లో తయారవుతున్న టెక్టాన్, నిస్సన్ పుంజుకోవడంలో సాయపడుతుందని కంపెనీ పేర్కొంది.
