వరంగల్ ఏనుమాముల మార్కెట్లో వరుణ యాగం

వరంగల్ ఏనుమాముల మార్కెట్లో వరుణ యాగం

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు. మార్కెట్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ ప్రియాంక, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, సభ్యులు, అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొని యాగ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

అన్నదాతలు సంతోషంగా ఉంటేనే వ్యాపార వర్గాలు, కార్మికులు, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రకృతిని నియంత్రించే సాంకేతికత మనిషికి అందుబాటులో లేనందున దైవ ప్రార్థనతో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం సుమారు 4 వేల మందికి మహా అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ అధికారులు, ఛాంబర్ సభ్యులు, రైతులు, వ్యాపారులు, కార్మికులు పాల్గొన్నారు.