గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌: అట్రాసిటీ కేసు పేరుతో బెదిరింపులు...హాస్టల్‌‌‌‌‌‌‌‌ వార్డెన్‌‌‌‌‌‌‌‌ నుంచి వసూళ్లకు పాల్పడ్డ తండ్రీకొడుకుల అరెస్ట్‌‌‌‌‌‌‌‌

గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌: అట్రాసిటీ కేసు పేరుతో బెదిరింపులు...హాస్టల్‌‌‌‌‌‌‌‌ వార్డెన్‌‌‌‌‌‌‌‌ నుంచి వసూళ్లకు పాల్పడ్డ తండ్రీకొడుకుల అరెస్ట్‌‌‌‌‌‌‌‌

గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌(ఉట్నూర్‌‌‌‌‌‌‌‌), వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించి ప్రభుత్వ హాస్టల్‌‌‌‌‌‌‌‌ వార్డెన్‌‌‌‌‌‌‌‌ నుంచి డబ్బులు వసూలు చేసిన తండ్రీకొడుకులను ఉట్నూర్‌‌‌‌‌‌‌‌ పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. సీఐ మడావి ప్రసాద్‌‌‌‌‌‌‌‌ వివరాల ప్రకారం.. ఉట్నూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన నేతావత్‌‌‌‌‌‌‌‌ రాందాస్, అతడి కొడుకు జైల్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ గత కొన్ని నెలలుగా ప్రభుత్వ గిరిజన బాలుర కాలేజీ హాస్టల్‌‌‌‌‌‌‌‌ వార్డెన్‌‌‌‌‌‌‌‌కు ఫోన్లు చేస్తూ తాము ఓ కార్యక్రమం చేస్తున్నామని, దానికి చందా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. 

అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించారు. దీంతో సదరు వార్డెన్ గత ఆరు నెలల్లో రెండు విడతల్లో రూ.3 వేల చొప్పున మొత్తం రూ.6 వేల వరకు ఇచ్చాడు. తాజాగా ఈ నెల 26న మరోసారి హాస్టల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి రూ.5 వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రాందాస్, జైల్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌లను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.