హైదరాబాద్‌‌‌‌ లో మొదటి ఊండ్ హీలింగ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌ లో  మొదటి  ఊండ్ హీలింగ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు:  దేశంలోనే మొదటి 'అడ్వాన్స్‌‌‌‌డ్ ఊండ్ హీలింగ్ అండ్ లింబ్ సాల్వేజ్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్'ను హైదరాబాద్‌‌‌‌లోని మూసారాంబాగ్‌‌‌‌లో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. దీంతో పాటు 'హ్యాపీ ఫీట్' పేరుతో  ప్రజా అవగాహన క్యాంపెయిన్‌‌‌‌ను లాంచ్ చేశారు. 

మధుమేహం (డయాబెటిస్),  దీర్ఘకాలిక గాయాల వల్ల కాళ్లు కోల్పోయే ప్రమాదం ఉన్న రోగులకు అత్యాధునిక సాంకేతికతతో చికిత్స అందించడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. ముందస్తు పరీక్షలు, సరైన వైద్యం ద్వారా 85శాతం వరకు కాళ్ల తొలగింపులను నివారించొచ్చని డాక్టర్ కేవీఎన్ఎన్ సంతోష్ మూర్తి  తెలిపారు.