లక్ష్మణ్‌‌ మార్గదర్శకత్వం స్ఫూర్తినిచ్చింది: శ్రేయస్‌‌

లక్ష్మణ్‌‌ మార్గదర్శకత్వం స్ఫూర్తినిచ్చింది: శ్రేయస్‌‌

హరారే: తాత్కాలిక కోచ్‌‌ వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌ మార్గదర్శకత్వం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని టీమిండియా టీ20 కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ అన్నాడు. ‘క్యాచ్‌‌లు మినహా ఈ సిరీస్‌‌ అంతటా సాధారణ ఆటతీరునే చూపెట్టాం. సపోర్ట్‌‌ స్టాఫ్‌‌ సహకారం వెలకట్టలేనిది. ప్రతి రోజు లక్ష్మణ్‌‌ సర్‌‌ అందించిన సూచనలు ఆచరణలో విజయం సాధించేలా కృషి చేశాయి. ఈ విజయాలను భవిష్యత్‌‌లోనూ కొనసాగిస్తాం’ అని శ్రేయస్‌‌ పేర్కొన్నాడు. 

ఇక శ్రేయస్‌‌ ఆత్మవిశ్వాసం, అంకితభావం తనను ఆకట్టుకున్నాయని లక్ష్మణ్‌‌ వెల్లడించాడు. ‘నేను శ్రేయస్‌‌ను ప్రత్యేకంగా అభినందించాలనుకుంటున్నా. ఎందుకంటే అతని కెప్టెన్సీ కెరీర్‌‌ ప్రారంభం అంత సజావుగా సాగలేదు. కానీ అతను తిరిగి పుంజుకున్న తీరు అద్భుతం. తొలి మ్యాచ్‌‌కు ఒక రోజు ముందు మాతో చేరినా తొలి రోజు నుంచే చాలా ఆశావహకంగా కనిపించాడు. 

జట్టులో చాలా మంది కొత్త ప్లేయర్లు ఉన్నారు. ఇంగ్లండ్‌‌లో ఆడిన వాళ్లలో కేవలం నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఈ టూర్‌‌లో చేరారు. అయినప్పటికీ శ్రేయస్‌‌ ఆత్మవిశ్వాసంతో జట్టును నడిపించాడు. ఈ విజయం ఘనత అతనికే చెందాలి. ప్లేయర్లను ప్రోత్సహించిన తీరు అద్భుతం’ అని లక్ష్మణ్‌‌ వ్యాఖ్యానించాడు.