తరౌబా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ నిలకడగా ఆడుతోంది. షాన్ మసూద్ (88 బ్యాటింగ్), ఇమామ్ ఉల్ హక్ (63) హాఫ్ సెంచరీలు చేయడంతో.. సోమవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో 199/3 స్కోరు చేసింది. అజాన్ అవైస్ (0) డకౌటైనా.. ఇమామ్, మసూద్ రెండో వికెట్‌కు 155 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (23) నిరాశపర్చాడు. ఆట ముగిసే టైమ్‌కు మసూద్‌తో పాటు సల్మాన్ ఆగా (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కీమర్ రోచ్, జైడెన్ సీల్స్, షామెర్ జోసెఫ్ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఇంకా 112 రన్స్ వెనకబడి ఉంది.
