ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవలకు అంతరాయం ఏర్పడింది..మెటా సంస్థకు చెందిన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లు ఎకౌంట్లు ఉన్నట్టుండి లాగ్ అవుట్ అవుతున్నాయి. తిరిగి లాగిన్ అయితే ఎర్రర్ వస్తోందని యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాదాపు అరగంటనుంచి ఇదే పరిస్థితి. భారత్ సహా అన్ని దేశాల్లో ఈ సమస్య తలెత్తింది. అయితే సేవలకు ఏర్పడిన అంతరాయంపై మెటా ఇప్పటివరకు స్పందించలేదు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతోందో స్పష్టత లేదు.
