ఆధ్యాత్మికం:  ఏ వస్తువులు దానం చేస్తే ..ఎలాంటి ఫలితం కలుగుతుంది..

ఆధ్యాత్మికం:  ఏ వస్తువులు దానం చేస్తే ..ఎలాంటి ఫలితం కలుగుతుంది..

 జీవించడం ఒక ఆర్ట్. వ్యక్తి వ్యక్తి తమ జీవితం గడిపే విధానంలో తేడా ఉంటుంది. ప్రతి వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి తన జీవితాన్ని గడుపుతాడు. అదే సమయంలో వ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి ప్రజలకు సహాయం చేయాలని సనాతన ధర్మం నమ్మకం. ఇది మానవత్వపు అనుభూతిని కలిగిస్తుంది. పురాణాల్లో  దానం గురించి కూడా వివరంగా చెప్పబడింది.  మరి  ఏ వస్తువులు దానం చేయడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. .

పురాణాల్లో దానం.. ధర్మం గురించి ప్రత్యేకంగా వివరించారు.  ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు.  తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. ధర్మం ఎవరికైనా.. ఎలా పడితే అలా చేయవచ్చు.  కానీ.. దానం..  చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకొనే వారు  సిద్ధంగా ఉండరు. శాస్త్రనియమానుసారం కొన్ని వస్తువులనే దానం చేయాలి.  వాటినే  వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు.

దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ దానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. ఈ పదింటిని దానం చేసినవారికి తప్పకుండా సమస్యలసలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.  అంతేకాదు ఏడు తరాలకు చెందిన పితృ దేవతలు ఆశీర్వదిస్తారని పురాణాల ద్వారా తెలుస్తుంది.  అయితే  వీటిలో కొన్నింటిని సామాన్యులకు చాలాకష్ట తరంతో కూడుకున్నది.  వాటకి పత్యమ్నాయంగా కొంత ధనం ఇచ్చి  వాటి పేరు చెప్పి దానం చేసే వెసులుబాటు కూడా ఉంది.  అయితే సామర్ధ్యం ఉండి అలా చేస్తే లాభం రాకపోగా.. నష్టం వస్తుంది.   వీటితో కొన్ని సమస్యల పరిష్కారానికి మరికొన్ని వస్తువులను దానం చేయాలి.   

  • 1. బియ్యాన్ని దానం చేస్తే: పాపాలు తొలగుతాయి.
  • 2. వెండిని దానం చేస్తే:  మనశ్శాంతి కలుగుతుంది.
  • 3. బంగారం దానం చేస్తే: గ్రహ దోషాలు తొలగుతాయి.
  • 4.పండ్లను దానంచేస్తే: బుద్ధి,సిద్ధి కలుగుతాయి.
  • 5. పెరుగును దానం చేస్తే: ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.
  • 6. నెయ్యి దానం చేస్తే:రోగాలు పోతాయి.....ఆరోగ్యంగా ఉంటారు.
  • 7. పాలు దానం చేస్తే:నిద్రలేమి ఉండదు.
  • 8. తేనెను దానం చేస్తే:  సంతానం కలుగుతుంది.
  • 9.ఉసిరికాయలు దానం చేస్తే:  మతిమరుపు తగ్గి ఙ్ఞాపక శక్తి పెరుగుతుంది.
  • 10. టెంకాయ దానం చేస్తే: అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.
  • 11. దీపాలు దానం చేస్తే: కంటిచూపు మెరుగుపడుతుంది.
  • 12.గోదానం చేస్తే: ఋణ విముక్తులౌతారు.ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
  • 13. భూమిని దానం చేస్తే: బ్రహ్మలోక దర్శనం ...ఈశ్వరలోక దర్శనం కలుగుతుంది.
  • 14. వస్త్ర దానం చేస్తే: ఆరోగ్య సమస్యలు పరిష్కారం.. ఆయుషు పెరుగుతుంది.
  • 15. అన్నదానం చేస్తే:పేదరికం తొలగిపోయి .ధనవృద్ధి కలుగుతుంది.
  • 16. లవణ(ఉప్పు)దానం చేస్తే :   బలం, ఆనందం కలుగుతుంది..

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.