చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల చాల ఆరోగ్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలుసు. అయితే కేవలం రెండు వారాల పాటు చక్కెర పూర్తిగా పక్కన పెడితే లేదా తీసుకోవడం మానేస్తే మన శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో వైద్య నిపుణులు వివరించారు.... చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చక్కెర కేలరీలను మాత్రమే పెంచడమే కాకుండా ఆకలి, కోరికలు, ఇన్సులిన్, లివర్ కొవ్వును నిశ్శబ్దంగా హైజాక్ చేస్తుంది.
మీరు చెక్కర తీసుకోవడం మానేస్తే మొదటి వారం నుంచే మీ శరీరంలో మార్పు మొదలవుతుంది. చక్కెర మానేసిన మొదట్లో తలనొప్పి, అలసట, చిరాకుగా అనిపించొచ్చు. ఇది శరీరంలో చక్కెర స్థాయి తగ్గడం వల్ల వచ్చే మార్పు మాత్రమే. కానీ 4-5 రోజుల తర్వాత ముఖంలో మార్పు కనిపిస్తుంది. ఇన్సులిన్ స్థాయిలు తగ్గడం వల్ల ముఖం మీద వాపు తగ్గి, ముఖం కాంతివంతంగా మారుతుంది.
శరీరంలో అనవసరంగా ఉన్న నీరు తగ్గి, పొట్ట భాగం తగ్గుతుంది. లోవర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే లివర్‌లో కొవ్వు చేరడం అంటే ఫాటీ లివర్ తగ్గుతుంది.
►ALSO READ | గడ్డివాముకి కుక్క కాపలా.. స్వార్థం ఉంటే ఆకలితో మాడాల్సిందే.. ఎద్దు.. కుక్క కథ
ఇక రెండవ వారం ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. రెండో వారంకి మీ శరీరం చక్కెర లేని స్థితికి అలవాటు పడుతుంది. అప్పుడు మీరు కొన్ని మార్పులు గమనించొచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండటం వల్ల మంచి నిద్ర పడుతుంది. మొటిమలు, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తగ్గి చర్మం క్లియర్ అవుతుంది. కడుపులో గ్యాస్, ఉబ్బరం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారం తిన్న తర్వాత వచ్చే నీరసం తగ్గి, శక్తి పెరుగుతుంది రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
మొత్తంగా 14 రోజుల పాటు చక్కెరను దూరం పెట్టడం వల్ల మీ రుచి మొగ్గలు (Taste buds) మళ్ళీ ఉత్తేజితం అవుతాయి. దీనివల్ల అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గడమే కాకుండా, మీ ఇన్సులిన్ వ్యవస్థ రీసెట్ అవుతుంది. కాబట్టి మీ శరీరాన్ని ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఈ 14 రోజుల ఎంతో ఉపయోగపడుతుంది.
