దోమలవల్ల జబ్బుల బారిన పడకుండా లిక్విడ్స్, రెపెల్లెంట్స్ వాడటం అందరం చేసేదే.
పిల్లల విషయంలో ఈ జాగ్రత్త ఇంకా ఎక్కువగా తీసుకుంటాం. ఎందుకంటే దోమలు కుడితే వచ్చే సమస్యలు అన్ని ఇన్నీ కావు. జ్వరం, ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిని మనం తట్టుకోగలం గానీ, చిన్నపిల్లలు తట్టుకోలేరు.
దోమలు కుట్టకుండా చేసేలా మార్కెట్లో అనేక రకాల రెపెల్లెంట్స్ దొరుకుతున్నాయి. వీటిని వాడడం వల్ల సమస్య తగ్గుతుంది. కానీ, ఇది ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
నిపుణులు. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నప్పుడు మస్కిటో రెపెల్లెంట్స్ వల్ల ఆ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.
ఎందుకంటే.. ఒక్క రెపెల్లెంట్స్ 137 సిగరెట్స్ తో సమానం. ఇందులో ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఇది ఎన్నో సమస్యలను తీసుకొస్తుంది. ముఖ్యంగా పిల్లలకి మరింత ప్రమాదకరం. మనం వాడే లోషన్స్, యాంటీ మస్కిటో క్రీమ్స్ చిన్న పిల్లల చర్మానికి అంత మంచిది. కాదు. ఇవి చర్మ సమస్యలను తీసుకొస్తాయని చెబుతున్నారుడాక్టర్లు.
పిల్లల చర్మం చాలా మృదువుగా ఉంటుంది. అందుకే వీటిని వాడేటప్పుడు ముందుగా డాక్టర్ల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు లోషన్స్ రాయడం వల్ల దానిని చేతులతో రుద్ది అవే చేతులను మళ్లీ నోల్లో పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల హెల్త్ పాడయ్యే అవకాశం ఉంది.
అందుకే పిల్లలు గదిలోలేనప్పుడు దోములకు కాయిల్స్ వాడండి దోమలు, పొగ రెండూ బయటికి వెళ్ళాక తలుపులు వేస్తే చాలు .ముఖ్యంగా వాటిని గది తలుపుల దగ్గర పెట్టండి. దీని వల్ల దోమలు లోపలికి రాకుండా పొగ అడ్డుకుంటుంది. స్ప్రేలు చేయడం చాలా మంచిది. దోమలు కుట్టకుండా నెట్ కూడా వాడొచ్చు..
దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిమ్మ, యూకలిప్టస్ ఆయిల్స్ పిల్లల చర్మానికి మంచివి కావు. అందుకే మూడు సంవత్సరాలలోపు పిల్లలకు వీటిని, వాడకపోవడమే మంచిది.
-వెలుగు,లైఫ్-
