Good Health: సమ్మర్ సీజన్: కీరాసూప్.. జ్యూస్.. వేడి పరార్.. మస్తు ఆరోగ్యం..!

Good Health: సమ్మర్ సీజన్:  కీరాసూప్.. జ్యూస్.. వేడి పరార్.. మస్తు ఆరోగ్యం..!

సమ్మర్ సీజన్ లో కీరదోసకి మస్త్ డిమాండ్. కీరదోసని అట్లనే కట్ చేసుకుని తినడమే కాకుండా.దాంతో జ్యూస్, సూప్ చేసుకోవచ్చు.  ఇవి తాగితే ఎండా కాలంలో చాలా ఆరోగ్యంగా ఉంటారు.  ఇమ్యూనిటి పవర్​ పెరుగుతుంది. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. .

కీరాతో సూప్ తయారీకి కావలసినవి

  • కీర దోసకాయ (పెద్దది) - ఒకటి
  • సొరకాయ ముక్కలు- ఎనిమిది..
  •  బటర్ - ఒక టేబుల్ స్పూన్
  • పాలు - అర కప్పు
  • ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా
  •  కొత్తిమీర, కీరదోసకాయ (సన్నగా రెండు టేబుల్ స్పూన్లు)

కీరాతో సూప్ తయారీ విధానం


* కీరదోసకాయను శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలు తరగాలి. (కొన్ని కీర ముక్కల్ని గార్నిష్ చేసేందుకు తరిగి పక్కన పెట్టాలి.) సొరకాయ పొట్టుతీసి పెద్ద ముక్కలు కోయాలి.

* నాన్ స్టిక్ ప్రెషర్ కుక్కర్లో బటర్ వేడిచేసి తరిగిన కీరదోసకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తరువాత అందులో రెండు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు స్టవ్ మీద ఉంచాలి.

* చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్లో పోసి ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి పాలు పోసి బాగా కలిపి మరోఐదు నిమిషాలు ఉడికించాలి. 

* ఇలా తయారైన సూప్​ను బౌల్​ లో పోసి కొత్తిమీర, కీరదోసకాయ తరుగుతో అలంకరించి తాగితే యమ్మీగా ఉంటుంది.

ఉసిరి, కీర జ్యూస్ తయారీకి కావలసినవి

  • కీరదోసకాయ ముక్కలు - ఒక కప్పు
  • ఉసిరి తరుగు - అరకప్పు 
  • తేనె - మూడు టీస్పూన్లు
  •  నీళ్లు - ఒక కప్పు

ఉసిరి, కీర జ్యూస్ తయారీ విధానం

* కీర దోసకాయని శుభ్రంగా కడిగి ముక్కలు తరగాలి. ఉసిరిని చిన్న చిన్న ముక్కలు తరగాలి.

*బ్లెండర్లో కీర, ఉసిరి ముక్కలు చేసి సరిపడా నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. తరువాత ఒక గ్లాసులో వడకట్టాలి..

* వడకట్టిన జ్యూస్​ లో  మూడు టీస్పూన్ల తేనె కలుపుకుని తాగితే టేస్టీగా ఉంటుంది.

* ఇది మంచి డీటాక్సిక్ జ్యూస్ దీన్ని తాగితే బరువు తగ్గుతారు. మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు బాడీ టెంపరేచర్ ను అదుపులో ఉంచుతుంది అంతే కాదు దీన్ని తాగితే చర్మం మెరుస్తుంది కూడా.

–వెలుగు,లైఫ్–​