ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌ అఫర్: కేవలం రూ.668కే మోటరోలా 5జి స్మార్ట్ ఫోన్..

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌ అఫర్: కేవలం రూ.668కే మోటరోలా  5జి స్మార్ట్ ఫోన్..

మీరు మోటరోలా బ్రాండ్ ఇష్టపడేవారైతే,  కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చూస్తుంటే.. బడ్జెట్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు... ఎందుకంటే  ఈ కామర్స్ దిగ్గజం  ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సందర్భగా స్పెషల్ సేల్ తీసుకొచ్చింది. ఈ సేల్ ద్వారా కళ్ళు చెదిరే అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్లలో ఒకటి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్, ఇప్పుడు ఈ ఫోన్  భారీ  తగ్గింపు ధరతో వస్తుంది. ఈ ఫోన్  కంపెనీ ప్రీమియం కర్వ్డ్ డిస్ప్లే మోడల్ ఫోన్.

డిస్కౌంట్ ఆఫర్‌:
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అసలు ధర రూ. 25,999, కానీ ఫ్లిప్‌కార్ట్ దీని ధరను 26 శాతం తగ్గించింది. అది కూడా రూ.20,000 కంటే తక్కువ ధరకే.  రూ. 7,000  తగ్గింపుతో ఇప్పుడు ఈ ఫోన్  రూ.18,999కే వస్తోంది,  

ఫ్లిప్‌కార్ట్ EMI ఆప్షన్‌:
మీ బడ్జెట్ తక్కువ  ఉంటే Flipkart EMI ఆప్షన్‌ కూడా ఇస్తుంది. నెలకు కేవలం రూ. 668తో విద్యార్థులకు లేదా స్మార్ట్‌ఫోన్‌  తీసుకునే ఎవరికైనా ఈ అఫర్ లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసి దాని కండిషన్ బట్టి మీరు రూ. 15,350 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే మొత్తం ధరను ఇంకా తగ్గొచ్చు.

ఎడ్జ్ 50 ఫ్యూజన్: స్పెసిఫికేషన్లు:
ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్లాస్టిక్ ఫ్రేమ్, ఎకో-లెదర్ బ్యాక్ తో  స్లిక్ డిజైన్‌, IP68 రేటింగ్ తో దుమ్ము, నీటి సమస్య ఉండదు. ముందు భాగంలో మీరు సూపర్-స్మూత్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల P-OLED కర్వ్డ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5  స్క్రీన్‌ను సురక్షితంగా ఉంచుతుంది.  Android 14, Snapdragon 7s Gen 2 చిప్‌, 12GB RAM, 512GB స్టోరేజ్ వస్తుంది. కాబట్టి మల్టీ టాస్కింగ్,  గేమింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫోటోల కోసం మీకు 50MP ప్రైమరీ కెమెరా, 13MP సెకండరీ కెమెరా,  ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. వీడియో కాల్స్ లేదా సోషల్ మీడియా కోసం ఫోటోలు తీయడానికి బెస్ట్ అని చెప్పొచ్చు.