ప్రముఖ కాలింగ్ సిగ్నల్ యాప్ యూజర్ల అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులకు చెందిన ఖాతాలను అనుమానాస్పద వ్యక్తులు లక్ష్యంగా చేసుకుని స్వాధీనం చేసుకుంటున్నారని నెదర్లాండ్స్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ ప్రకటించింది . యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచింది.
ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులతో సహా కొంతమంది సిగ్నల్ యూజర్ల అకౌంట్లను స్వాధీనం చేసుకునేందుకు జరుగుతోన్న ఫిషింగ్ దాడులపై మేం అప్రమత్తంగా ఉన్నాం. దీనిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. సిగ్నల్ ఎన్‌క్రిప్షన్, సాఫ్ట్ వేర్ మౌలిక సదుపాయాలపై ఏమాత్రం ఎఫెక్ట్ కాలేదు. ఇవి ఇప్పటికీ అత్యంత పటిష్టంగా ఉన్నాయి. అని సిగ్నల్ యాప్ ప్రకటించింది.
కొంతమంది యూజర్ల అకౌంట్లు హ్యాక్ అవ్వడానికి కారణం ఫిషింగ్. అంటే హ్యాకర్లు మోసపూరిత లింకులు లేదా మెసేజ్ లు పంపి, వినియోగదారులనే స్వయంగా వారి SMS కోడ్ (OTP) లేదా సిగ్నల్ పిన్ అడిగి తెలుసుకుంటున్నారు. ఆ సమాచారంతోనే ఖాతాలను వేరే డివైజ్‌లలో లాగిన్ చేస్తున్నారు.
We are aware of recent reports regarding targeted phishing attacks that have resulted in account takeovers of some Signal users, including government officials and journalists. We take this very seriously.
— Signal (@signalapp) March 9, 2026
To be clear: Signal’s encryption and infrastructure have not been…
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మొబైల్ హ్యాక్ అయిందని అనుమానం వచ్చిన వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి కాల్ ఫార్వార్డింగ్‌ను డిజేబుల్ చేయాలి.
- తెలియని, అనుమానాస్పద యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోకూడదు.
- ఫోన్‌లో ఫ్యాక్టరీ రిసెట్ చేసుకుంటే హ్యాకింగ్ బారి నుంచి తప్పించుకోవచ్చు.
- యాప్స్‌ను లింక్‌లు, ఏపీకే ఫైల్స్ నుంచి కాకుండా.. ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- వాట్సాప్‌కు టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకుంటే హ్యాక్‌కు గురికాకుండా కాపాడుకోవచ్చు.
- సైబర్ మోసాలకు గురైతై వెంటనే 1930కి కాల్
