సాఫ్ట్వేర్ డెవలపర్లు AI వాడుతున్నారా..? పాపం ఈ విషయం తెలుసో.. లేదో..!

సాఫ్ట్వేర్ డెవలపర్లు AI వాడుతున్నారా..? పాపం ఈ విషయం తెలుసో.. లేదో..!

హైదరాబాద్, వెలుగు: AI అనేది సాఫ్ట్‌‌‌‌వేర్ రంగానికి ఎంత వేగాన్ని ఇస్తుందో, హ్యాకర్లకు కూడా అంతే వేగాన్ని ఇస్తోంది. కాబట్టి డెవలపర్లు ఏఐ వాడేటప్పుడు తమ సాఫ్ట్‌‌‌‌వేర్ సప్లయ్‌‌‌‌ చైన్ భద్రతపై మరింత జాగ్రత్తగా ఉండాలని సెక్యూరిటీ సంస్థ సోనాటైప్ తెలిపింది.

ఫారెస్టర్‌‌‌‌‌‌‌‌తో కలిసి సైబర్ దాడులపై  ఓ రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేసింది. టార్గెటెడ్‌‌‌‌గా జరుగుతున్న హానికర సాఫ్ట్‌‌‌‌వేర్ ప్యాకేజీల దాడులు 2023 లోని  28 నుంచి 2025 నాటికి 1,576 కి చేరాయని,  75 రెట్లు పెరిగాయని వివరించింది.

‘‘ప్రస్తుతం నమోదవుతున్న హానికర ప్యాకేజీలలో 47 శాతం అసలైన, నమ్మకమైన సాఫ్ట్‌‌‌‌వేర్ పేర్లు, భాగాలను పోలి ఉంటూ డెవలపర్లను మోసం చేస్తున్నాయి. 53 శాతం హానికర ప్యాకేజీలు సాఫ్ట్‌‌‌‌వేర్ ఇన్‌‌‌‌స్టాలేషన్ సమయంలోనే దాడులు చేస్తున్నాయి.

సెక్యూరిటీ సిస్టమ్స్ హెచ్చరించే లోపే పని పూర్తి చేస్తున్నాయి. భారత్‌‌‌‌లోని ఐటీ, ఫిన్‌‌‌‌టెక్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) పెద్ద ఎత్తున ఏఐ, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌లను వాడుతున్నందున.. కోడింగ్ ప్రారంభ దశలోనే భద్రతా పర్యవేక్షణ అత్యంత కీలకం”అని సోనాటైప్  తెలిపింది.