రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు 4 నెలల గడువు పెంపు

రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు 4 నెలల గడువు పెంపు
  • పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రెరా నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నాలుగు నెలల గడువు పెంచింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 31 మధ్య గడువు ముగిసే అన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు నవంబర్‌ 30 వరకు ఈ పొడిగింపు వర్తిస్తుందని రెరా సెక్రటరీ కె. శ్రీనివాస్ తెలిపారు.

ఈ గడువు పెంపు కోసం బిల్డర్లు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.