OnePlus N6x స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. ఛార్జింగ్ దిగిపోతుందనే భయమే అక్కర్లేదు.. రేటు రూ. 20 వేల లోపే..!

OnePlus N6x స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. ఛార్జింగ్ దిగిపోతుందనే భయమే అక్కర్లేదు.. రేటు రూ. 20 వేల లోపే..!

ప్రముఖ టెక్ కంపెనీ OnePlus తమ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ను మన దేశంలో విడుదల చేసింది. OnePlus N6x వచ్చేసింది. OnePlus N సిరీస్ నుంచి ఇది రెండవ స్మార్ట్ ఫోన్ కావడం గమనార్హం. వచ్చే వారం నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఆన్ లైన్, ఆఫ్ లైన్లో మొదలుకానున్నాయి. 

ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్. 4జీబీ ర్యామ్తో అందుబాటులోకి వచ్చింది. రెండు రంగుల్లో వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది.  ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 7,000mAh కావడంతో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం అక్కర్లేదు. 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇండియాలో వన్‌ప్లస్ N6x 4GB RAM, 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ. 18,999. 4GB + 128GB RAM స్టోరేజ్ మోడల్ ధర రూ. 20,999గా వన్ ప్లస్ డిసైడ్ చేసింది. బ్యాంక్ కార్డులపై రూ.15 వందల ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో.. ఇలా ధరను తగ్గించుకోవచ్చు. 

ఈ కొత్త స్మార్ట్ ఫోన్స్ ఆగస్ట్ 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్లో సేల్కు అందుబాటులోకి రానున్నాయి. ద్వారా భారతదేశంలో అమ్మకానికి రానుంది. వన్‌ప్లస్ N6x బర్గండీ రెడ్, ఐస్ బ్లూ రంగులలో ఈ స్మార్ట్ ఫోన్ను డిజైన్ చేశారు.

వన్‌ప్లస్ N6x ఫీచర్స్:
* 6.8 అంగుళాల HD+ (720 x 1,570 పిక్సెల్స్) LCD టచ్‌స్క్రీన్
* ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ చిప్‌సెట్‌
 * 13-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
* 5-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
* 1080p/30 fps క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకునే వెసులుబాటు
* 7,000mAh బ్యాటరీ
* 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
* 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ 
* బరువు-సుమారు 214g