Sunny Deol : బాక్సాఫీస్ వద్ద 'బోర్డర్ 2' యుద్ధం.. ట్రాక్టర్లపై థియేటర్లకు క్యూ కట్టిన ఫ్యాన్స్!

Sunny Deol : బాక్సాఫీస్ వద్ద 'బోర్డర్ 2' యుద్ధం.. ట్రాక్టర్లపై థియేటర్లకు క్యూ కట్టిన ఫ్యాన్స్!

సరిగ్గా 27 ఏళ్ల క్రితం 'బోర్డర్' సినిమాతో దేశభక్తి సెగలు పుట్టించారు బాలీవుడ్ హీరో సన్నీ డియోల్. ఇప్పుడు అదే రేంజ్ లో 'బోర్డర్ 2' మూవీతో వచ్చి థియేటర్ లలో సెల్యూట్ చేయిస్తున్నారు . జనవరి 23న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజే దేశవ్యాప్తంగా రూ.30 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ బాక్సీఫీస్ వద్ద మాస్ పవర్ ఏంటో మరోసారి నిరూపిస్తోంది..

ట్రాక్టర్లపై థియేటర్లకు ఫ్యాన్స్ !

ఈ  'బోర్డర్ 2'  సినిమా మేనియా ఏ రేంజ్ లో ఉందంటే.. ఉత్తరప్రదేశ్ లోని నజీబాబాద్‌లో ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సాధారణంగా కార్లు, బైక్‌లపై థియేటర్లకు రావడం చూస్తుంటాం. కానీ, సన్నీ డియోల్ క్రేజ్ ముందు అవేవీ సరిపోవన్నట్టు.. వందలాది మంది అభిమానులు ట్రాక్టర్లపై జాతీయ జెండాలు పట్టుకుని, సన్నీ డియోల్ పోస్టర్లతో థియేటర్లకు తరలిచ్చారు. జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ... పొలాల నుండి సినిమా హాల్ వరకు అభిమానులు 'బోర్డర్ 2' మూవీని ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గ్రౌండ్ లెవల్ సినిమా అంటే ఇదే అంటూ కామెంట్స్ చేస్తుున్నారు.

ALSO READ :  క్రేజీ మల్టీస్టారర్‌గా 'కాక్‌టెయిల్ 2'..

కథా నేపథ్యం..

1971 భారత్-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సన్నీ డియోల్ తన పాత పాత్రలోనే గంభీరంగా కనిపించారు. ఆయనతో పాటు ఈ సీక్వెల్‌లో వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి వంటి యంగ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. ఇక మోనా సింగ్, సోనమ్ బజ్వా తమ నటనతో మెప్పించారు. జేపీ దత్తా నేతృత్వంలో భూషణ్ కుమార్ ఈ భారీ యుద్ధ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తోంది.

ALSO READ : ధనుష్ -మృణాల్ ఠాకూర్ పెళ్లి వీడియో వైరల్..

 వెండితెరపై దేశభక్తి గర్జన!

తొలి రోజు నుంచే 'బోర్డర్ 2' చిత్రం విమర్శకుల నుండి కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ "బోర్డర్ 2 కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాదు.. అదొక భావోద్వేగం. థియేటర్లో కూర్చున్న ప్రతి భారతీయుడితో సెల్యూట్ చేయించే సినిమా ఇది అంటున్నారు ప్రేక్షకులు.. ఎమోషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి అని ప్రశంసిస్తున్నారు. సినిమాలో హీరోలు డైలాగులు చెబుతుంటే థియేటర్లలో ఈలలు, గోలలు మిన్నంటుతున్నాయి.

ALSO READ : సోషల్ మీడియాలో అసభ్య ట్రోలింగ్‌..

మరో 'గదర్ 2' కానుందా?

గతంలో 'గదర్ 2' తో సన్నీ డియోల్ ఎలాంటి రికార్డులు సృష్టించారో మనకు తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో 'బోర్డర్ 2' దూసుకుపోతోంది. మొదటి వారాంతం ముగిసేసరికి ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం సినిమాగానే కాకుండా, దేశభక్తిని చాటిచెప్పే ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా ఈ చిత్రం నిలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.