Dhanush-Mrunal Wedding: ధనుష్ -మృణాల్ ఠాకూర్ పెళ్లి వీడియో వైరల్.. అసలు విషయం చెప్పిన సన్నిహితులు!

Dhanush-Mrunal Wedding: ధనుష్ -మృణాల్ ఠాకూర్ పెళ్లి వీడియో వైరల్..  అసలు విషయం చెప్పిన సన్నిహితులు!

ఇంటర్ నెట్ ప్రపంచంలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో ఊహింలేము. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి వచ్చే వార్తలకైతే  లెక్కే లేదు. సినీ ప్రముఖుల విషయంలో అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇదే కోవలో లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నటి మృణాల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న కథనాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీనికి తోడు వారిద్దరికీ పెళ్లి జరిగినట్లు ఉన్న  వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

'ఏఐ' మాయాజాలం

జనవరి 22న ధనుష్, మృణాల్ సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇది నిజమైన వీడియో కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానంతో సృష్టించిన  వీడియో. ఈ వీడియోలో కేవలం వధూవరులే కాకుండా, సినీ ప్రముఖులు త్రిష, శృతి హాసన్, అనిరుధ్ రవిచందర్, అజిత్ కుమార్, దుల్కర్ సల్మాన్, దళపతి విజయ్ వంటి వారు కూడా హాజరైనట్లు అత్యంత సహజంగా చూపించారు. ఇది చూసి సామాన్య ప్రజలు సైతం వీరిద్దరి పెళ్లి నిజమేమో అని భ్రమపడుతున్నారు.

పుకార్లకు చెక్ ..

అయితే వాలెంటైన్స్ డే రోజు ( 2026, ఫిబ్రవరి 14 )   ధనుష్, మృణాల్ వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారంపై మృణాల్ ఠాకూర్ సన్నిహిత వర్గాలు ఇటీవల క్లారిటీ ఇచ్చాయి. ఈ వార్తల్లో ఏలాంటి నిజం లేదు అంతా ఫేక్ అని తేల్చిచెప్పారు. మృణాల్ ప్రస్తుతం తన కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది. ఫిబ్రవరిలో ఆమె నటించి ఒక సినిమా విడుదల సిద్ధంగా ఉంది, మార్చిలో మరో తెలుగు సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య పెళ్లి ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు.

మృణాల్ రియాక్షన్..

తనపై వస్తున్న పుకార్ల మధ్య మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సముద్రపు ఒడ్డున ప్రశాంతంగా ఉన్న వీడియోను షేర్ చేస్తూ..అడుగులు నేలపైనే ఉన్నాయి, మెరుస్తున్నాను, ఏ శబ్దానికి చలించడం లేదు (  "Grounded, glowing and unshaken!"  ) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే, తనపై వచ్చే పుకార్లను ఆమె పట్టించుకోవడం లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పింది.

రూమర్స్ ఎలా మొదలయ్యాయంటే?

ధనుష్, మృణాల్ మధ్య ఏదో ఉందనే వార్తలు 2025 ఆగస్టు నుంచే వినిపిస్తున్నాయి. 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్ షోలో ధనుష్‌ను మృణాల్ ఎంతో ఆత్మీయంగా పలకరించడం. అలాగే ధనుష్ నటిస్తున్న 'తేరే ఇష్క్ మే' రాప్ అప్ పార్టీలో మృణాల్ కనిపించడంతో వీరిద్దరి మధ్య స్నేహం అంతకు మించి ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఇప్పటి వరకు వీరిద్దరూ తమ సంబంధంపై అధికారికంగా ఎక్కడా స్పందించలేదు.

సాంకేతికత పెరిగిన తర్వాత సెలబ్రిటీల ముఖాలను ఉపయోగించి ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించడం పెరిగిపోయింది. ధనుష్, మృణాల్ విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం వారిద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాబట్టి అభిమానులు ఇలాంటి ఏఐ సృష్టించిన భ్రమలను నమ్మవద్దని  సూచిస్తున్నారు సినీ విశ్లేషకులు.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dev Pal (@devaimation)