వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. వైవిధ్యమైన పాత్రలు, అద్భుతమైన నటన, గ్లామర్‌తో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా సౌత్ నుంచి నార్త్ వరకు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం తన కెరీర్ లో గోల్డెన్ పీరియడ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే 'కాక్‌టెయిల్ 2'. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
'కాక్‌టెయిల్ 2' నాకెంతో ప్రత్యేకం
లేటెస్ట్ గా'కాక్‌టెయిల్ 2' మూవీ గురించి రష్మిక ఆసక్తికర విషయాలను పంచుకుంది. సారికా భరద్వాజ్ దర్శకత్వం వహించిన 'కాక్‌టెయిల్' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. సుమారు దశాబ్దం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కాక్‌టెయిల్ 2' రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకం అని చెప్పింది రష్మిక. ఇప్పుడే సినిమా గురించి ఎక్కువ విషయాలు వెల్లడించలేను కానీ, నా పాత్ర కథలో సరికొత్త ఎనర్జీని తీసుకువస్తుంది. ఈ సినిమాలో నన్ను కొత్తగా చూస్తారు అని ధీమా వ్యక్తం చేసింది.
2025 నేర్పిన పాఠాలు..
2025 సంవత్సరం రష్మిక కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన హారర్ కామెడీ 'థమ్మా' విజయం తర్వాత ఆమె మరింత ఉత్సాహంగా ఉంది. గత ఏడాది విభిన్న భాషల్లో నటించడం, కొత్త వ్యక్తులను కలవడం నాకెంతో నేర్పింది. ఎన్ని విజయాలు వచ్చినా, ఎంత బిజీగా ఉన్నా నేలపైనే ఉండటం , నిరంతరం నేర్చుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఏడాది నాకు అర్థమైంది. ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడమే అసలైన విజయం అని రష్మిక తెలిపింది..
క్రేజీ మల్టీస్టారర్..
ఈ సినిమాలో రష్మికతో పాటు బాలీవుడ్ హార్ట్ త్రోబ్ షాహిద్ కపూర్, స్టార్ హీరోయిన్ కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృతి సనన్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఉత్సాహంగా ఉంది. "తీరే ఇష్క్ మే" వంటి బరువైన ఎమోషనల్ సినిమా తర్వాత, తాను ఒక లైట్ హార్టెడ్ రామ్-కామ్ సినిమా చేయాలనుకున్నానని, సరిగ్గా అదే సమయంలో 'కాక్‌టెయిల్ 2' ఆఫర్ వచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. యూత్ ఫుల్ కథాంశంతో వస్తున్న ఈ 'కాక్‌టెయిల్ 2' 2026లో థియేటర్లలో సందడి చేయనుంది. రష్మిక, షాహిద్, కృతిల కలయిక వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రష్మిక తన నటనతో ఈ సీక్వెల్‌ను ఏ స్థాయికి తీసుకువెళ్తుందో వేచి చూడాల్సిందే!
