వారఫలాలు: కొత్త సంవత్సరం జనవరి నెల చివరి ఆదివారం రథసప్తమి పర్వదినంతో ప్రారంభమవుతుంది. సూర్య భగవానుడు పుట్టిన రోజు సూర్యుడు ఏడుగుర్రాలపై తన దిక్కును మార్చుకుంటాడు.దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. రథసప్తమితో ప్రారంభమైన వారంలో ఏ రాశి వారికి ఎలా ఉంది. ఎవరు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( 2026 జనవరి25 నుంచి 31 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం...
మేషరాశి: ఈ వారం ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులను సమర్థవంతంగా... సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సమయస్ఫూర్తితో వ్యవహరించడం జరుగుతుంది. వృత్తి.. ఉద్యోగాలలో అధికారులతో సామరస్య వాతావరణం నెలకొంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
వృషభ రాశి: ఈ రాశి వారికి గతంలో ఆగిపోయిన కార్యక్రమాలు కొంతవరకూ పుంజుకుంటాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతాయి. ఆస్తి వ్యవహారాలలో కీలక ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించండి. వృథా ఖర్చులుంటాయి. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి.
మిథునరాశి:ఈ రాశి వారు ఈ వారం వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరులతో సంభాషించే విషయంలో జాగ్రత్తలు పాటించండి. పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకు .. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కర్కాటకం: ఈ రాశి వారు ఈ వారం ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసు కుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. పెళ్లి వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం..ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సంపాదించుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిపాటి ఇబ్బందులుండే అవకాశముంది.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
సింహరాశి: ఈ రాశివారు ఈ వారం కొత్తగా ఇంటి నిర్మాణానికి ప్లాన్ వేస్తారు. సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ... అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బ్యాంకు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ప్రేమ.. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
కన్యా రాశి: ఈ వారం ఈ రాశి వారు ఉత్సాహంతో .. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. సోదరుల వ్యవహారాలు.. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులు పై ఆఫీసర్ల నుంచి ప్రశంశలు అందుకుంటారు. జాబ్ హోల్డర్స్ కు గతంలో ఉన్న సమస్యలనుంచి విముక్తి కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వవద్దని పండితులు సూచిస్తున్నారు.
తులారాశి: ఈ రాశి వారు అనవసరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భూమి విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఊహించని ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబపెద్దల సలహాల.. సూచనలతో పనులు పూర్తవుతాయి. ఇక ఉద్యోగులు ఆఫీసులో శాంతంగా ఉండండి. ఎలాంటి వివాదాలజోలికి వెళ్లవద్దని పండితులు సూచిస్తున్నారు.
వృశ్చికరాశి: ఈ వారం ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతాయి. చేపట్టిన పనుల్లో మొదట్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విందు.. వినోద కార్యక్రమాలకు హాజరవుతారు.వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి అడుగు వేయాలి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా కలసి వస్తాయి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు ఉంటాయి.ఉద్యోగులు పని ఒత్తిడులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ వారం తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. . కొత్త స్నేహాలు లాభదాయకంగా వుంటాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రేమ... పెళ్లి విషయాల వ్యవహారాను వాయిదా వేసుకోండి. అనవసర విషయాల్లో జోక్యం వద్దని పండితులు సూచిస్తున్నారు.
మకరరాశి: ఈ వారం ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగిపోతాయి. ఏ పని చేపట్టినా పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతాయి. .. బంధువులు.. స్నేహితులతో వివాదాలు తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న వారికి అనుకోకుండా ఒక సంపన్న కుటుంబంతో పెళ్లి కుదిరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
కుంభరాశి:ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పని విషయంలో కూడా ఆందోళన చెందుతారు. ఓర్పు ..సహనంతో వ్యవహరించి ఓ నిర్ణయం తీసుకోండి. అంతా మంచే జరుగుతుంది. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ నుంచి సహాయాలు పొందినవారు ముఖం చాటేస్తారు. స్థిరాస్థి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మీనరాశి: ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో మొదట్లో కొంత గందరగోళం ఏర్పడుతుంది. వారం మధ్యలో నుంచి క్రమేణ పూర్తవుతాయి. కుటుంబసభ్యుల సహకారంతో మనశ్శాంతి లభిస్తుంది. ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. సహోద్యోగుల సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం
