ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతిని టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్.. నాన్ స్టాప్ డెలివరీ ఆర్డర్స్ తో టార్చర్..

ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతిని టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్.. నాన్ స్టాప్ డెలివరీ ఆర్డర్స్ తో టార్చర్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందిన రాజాసాబ్ సినిమా ఇటీవలే విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాన్ని చవి చూసిందని చెబుతున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ సినిమా నష్టాలతో ప్రొడ్యూసర్స్ సతమతం అవుతుంటే.. డైరెక్టర్ మారుతికి వెరైటీ తిప్పలు వచ్చి పడ్డాయి. సినిమా డిజాస్టర్ అవ్వడంతో మారుతిని టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మారుతి ఇంటికి నాన్ స్టాప్ గా డెలివరీ ఆర్డర్స్ పెడుతూ టార్చర్ చూపిస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా నచ్చకపోతే తన ఇంటికి వచ్చి నిలదీయండి అంటూ తన ఇంటి అడ్రస్ చెప్పాడు డైరెక్టర్ మారుతి. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఆయనకు కొత్త తిప్పలు తెచ్చి పెట్టింది. కొండాపూర్ లోని కొల్ల లగ్జరీ విల్లాస్ లోని మారుతి ఇంటికి నాన్ స్టాప్ గా డెలివరీ ఆర్డర్స్ పెడుతూ టార్చర్ పెడుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు.

మారుతి ఇంటికి ఇప్పటిదాకా 100కు పైగా  డెలివరీ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది.మారుతి ఇంటి నంబర్ పై జుమోటో,స్విగ్గి, ఫుడ్ డెలివరీ,అమెజాన్, ఆర్డర్లు పంపుతున్నారు గుర్తుతెలియని వ్యక్తులు.ప్రతి ఒక్కరు క్యాష్ ఆన్ డెలివరీ తో ఆర్డర్స్ పంపుతున్నట్లు తెలుస్తోంది.సెక్యూరిటీ గార్డ్ లకు సైతం ఈ అర్దార్లు తలనొప్పిగా మారాయని అంటున్నారు.

Also Read : రూట్ మార్చిన మిల్కీ బ్యూటీ

ఆర్డర్స్ డెలివరీపై విల్లాకి ఫోన్ చేసి అడగగా నేను ఎలాంటి డెలివరీలు చేయలేదని మారుతి చెబుతున్నాడని అంటున్నారు సెక్యూరిటీ సిబ్బంది.రాజాసాబ్ సినిమా పైన అసంతృప్తితో ప్రభాస్ ఫ్యాన్సే మారుతి ఇంటికి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పంపుతున్నారని టాక్ వినిపిస్తోంది. చేసేది ఏమీ లేక దర్శకుడు ఆగ్రహంతో నా పేరు మీద ఏది వచ్చిన లోపలికి పంపకండి అని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న సెక్యూరిటీ సిబ్బంది.