గద్దర్ పాటలే నాకు స్ఫూర్తి.. 'దండోరా'కు గద్దర్ అవార్డుపై మార్క్ కె రాబిన్ భావోద్వేగం!

గద్దర్ పాటలే నాకు స్ఫూర్తి.. 'దండోరా'కు గద్దర్ అవార్డుపై మార్క్ కె రాబిన్ భావోద్వేగం!

తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న యువ సంచలనం మార్క్ కె రాబిన్. 'అ!' చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టిన ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, నేడు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'గద్దర్ అవార్డు'ను కైవసం చేసుకుని తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా మార్క్ కె రాబిన్ తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

'దండోరా'తో గద్దర్ అవార్డు విజేతగా..

తెలంగాణ ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డుల్లో, ‘దండోరా’ చిత్రానికి గానూ మార్క్ కె రాబిన్‌కు 'బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్' పురస్కారం లభించింది. ఈ సినిమాలో ఆయన అందించిన సోల్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా కదిలించాయి. చిన్నప్పటి నుండి గద్దర్ పాటలంటే ఎంతో ఇష్టమని, ఆ విప్లవ గీతాల స్ఫూర్తితో పెరిగిన తనకు ఆయన పేరు మీద అవార్డు రావడం పూర్వజన్మ సుకృతమని మార్క్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ గుర్తింపునిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అవార్డుల పంట.. బాలీవుడ్ ఎంట్రీ!

మార్క్ కె రాబిన్ ప్రయాణం కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. "8AM Metro" చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, తొలి సినిమాతోనే బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా 'ఐరా' (IRA) అవార్డును అందుకున్నారు. ఆయన కెరీర్‌లో ‘మళ్లీ కలుద్దాం’ చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ గా సైమా (SIIMA) 2017అవార్డు.  ‘సూర్యకాంతం’కు బెస్ట్ అప్ కమింగ్ కంపోజర్, ‘మల్లేశం’లోని ‘నాకు నువ్వని’ పాటకు బెస్ట్ కంపోజర్  మిర్చి మ్యూజిక్ అవార్డ్స్, నోయిడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'డిలి బిలీ' చిత్రానికి ప్రత్యేక ఇంటర్నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు..

మ్యూజిక్ మ్యాజీషియన్ గా,..

మార్క్ కె రాబిన్ అంటే కేవలం మెలోడీలు మాత్రమే కాదు, థ్రిల్లర్, కామెడీ జానర్లలో కూడా అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని (BGM) అందిస్తారని పేరుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సక్సెస్‌లో మార్క్ బిజీఎం కీలక పాత్ర పోషించింది. మల్లేశం, జాంబీ రెడ్డి వంటివిభిన్నమైన నేపథ్యాలున్న ఈ సినిమాలకు తన సంగీతంతో  ప్రాణం పోశారు. మిషన్ ఇంపాజిబుల్ చిన్న పిల్లల అడ్వెంచరస్ డ్రామాను తన సంగీతంతో మరో లెవల్‌కు తీసుకెళ్లారు.

దాదాపు 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించిన మార్క్, నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చే టెక్నీషియన్‌గా పేరు తెచ్చుకున్నారు. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన దర్శకుడు మురళీకాంత్, నిర్మాత రవీంద్ర బెనర్జీ ,  తన టీమ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.