ఆకాష్ పూరి 'రూహబూబా' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే బిల్లుతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తక్కువ టైంలోనే యూత్ లో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుంది. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఫేమ్ మాత్రం రాలేదు.
దీంతో మెల్లగా ఇండస్ట్రీ లో ఆఫర్స్ తగ్గిపోయాయి. చివరిగా 'డ్యూడ్' సినిమాలో కనిపించిన ఈ భామ.. ప్రస్తుతం సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. సినిమా ఆఫర్స్ తగ్గినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు రెడ్ అవుట్ ఫిట్‌లో అందాలు అరబోస్తూ మెస్మరైజ్ చేసేంది. నేహా శెట్టి షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. కొంతముంది. గార్జియస్ అంటూ కామెంట్స్ చేస్తుంటే.. ఇంకొంతమంది ఈ విశ్వంలోనే అత్యంత అందమైన అమ్మాయి' అంటూ పొగడ్తతోనే ముంచెత్తుతున్నారు.
