గణతంత్ర దినోత్సవం..గ్యాలంటరీ అవార్డులు ప్రకటించిన కేంద్రం..15 మంది తెలంగాణ పోలీసులకు పతకాలు

గణతంత్ర దినోత్సవం..గ్యాలంటరీ అవార్డులు ప్రకటించిన కేంద్రం..15 మంది తెలంగాణ పోలీసులకు పతకాలు

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం(జనవరి 25) కేంద్ర హోంశాఖ గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ సర్వీసులో పని చేసే 986 మంది పోలీసులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.ఈమేరకు కేంద్ర హోంశాఖ లిస్టును రిలీజ్ చేసింది.ఇందులో తెలంగాణకు చెందిన 15 మంది, ఏపీనుంచి 17మంది పోలీసులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు.  

అందులో అడిషనల్ ఎస్పీ మందా జీఎస్‌ ప్రకాశ్‌రావు, ఎస్సై  అన్ను దామోదర్‌రెడ్డి ప్రెసిడెంట్‌ మెడల్స్‌ అందుకోనున్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ మర్రి వెంకట్‌రెడ్డి గ్యాలంటరీ అవార్డుకు సెలెక్ట్​అయ్యారు. ప్రజా భద్రత,  రక్షణకు దోహదపడిన పోలీసు సిబ్బంది ధైర్యసాహసాలు, అంకితభావం, ప్రశంసనీయ సేవలకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలుస్తాయి.

►ALSO READ | ట్రాఫిక్ రూల్స్ పాటించడం అందరి బాధ్యత : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ప్రతి సంవత్సర  స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర(రిపబ్లిక్) దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను  ప్రకటిస్తుంది. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్వించనందుకు దేశవ్యాప్తంగా పోలీసులకు ఈ పతకాలను అందిస్తారు. 

12 మందికి సేవా పతకాలు..

  • బడుగుల సుమతి, ఇన్‌స్పెక్టర్ జనరల్
  • పాగుంట వెంకట్ రాములు, కమాండెంట్ 
  • మొగిలిచెర్ల శంకర్, డీఎస్పీ 
  • అట్లూరి భాను మూర్తి, సీనియర్ కమాండెంట్ 
  • కేవీఎం ప్రసాద్,  డీసీపీ
  • సి వంశీ మోహన్ రెడ్డి,  డీఎస్పీ 
  • తుమ్మల లక్ష్మి,  డీఎస్పీ 
  • బుర్రా ఎల్లయ్య, సబ్-ఇన్​స్పెక్టర్ 
  • వి పురుషోత్తం రెడ్డి, సబ్-ఇన్​స్పెక్టర్ 
  • సయ్యద్ అబ్దుల్ కరీం, సబ్-ఇన్​స్పెక్టర్ 
  • బొడ్డు ఆనందం, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ 
  • పైలి మనోహర్, హెడ్ కానిస్టేబుల్