Nagababu: X(ట్విట్టర్) నుండి మెగా బ్రదర్ నాగబాబు అవుట్.. కారణం ఏంటంటే?

Nagababu: X(ట్విట్టర్) నుండి మెగా బ్రదర్ నాగబాబు అవుట్.. కారణం ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల వేల మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ ఎన్నికల్లో మామయ్య పవన్ కళ్యాణ్(Pawan kalyan) తరుపున కాకుండా తన స్నేహితుడు వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు అల్లు అర్జున్(Allu Arjun). దీంతో మెగా అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు అల్లు అర్జున్ పై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు ఒకడుగు ముందుకు వేసి ఏకంగా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే.. అని రాసుకొచ్చాడు.  

దీంతో.. నాగబాబు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అంతేకాదు ఈ ఒక్క పోస్ట్ మెగా, అల్లు కుటుంబాల మధ్య పెద్ద దుమారమే రేపింది. ఈ విషయంలో నాగబాబుకు మెగాస్టార్ నుండి వార్నింగ్ కూడా వచ్చిందని టాక్. అందుకే నాగ బాబు ట్విట్టర్ నుండి వైదొలగారని తెలుస్తోంది. అవును.. తాజాగా నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేశారు. మరి నిజంగా అల్లు అర్జున్ పై ట్వీట్ కారణంగానే ఆయన ట్విట్టర్ అకౌంట్ డిలేట్ చేశారా, లేదా మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే.. ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా చూడాలి.