
తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో G.O.A.T(Greatest Of All Time) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసందే. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నాడని టాక్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా విషయానికి వస్తే..భారీ బడ్జెట్తో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..‘అవతార్’, ‘అవెంజర్స్’లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన సాంకేతిక నిపుణులు జాయిన్ అయినట్లు గోట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అర్చనా కళ్పతి సోషల్ మీడియాలో షేర్ చేశారు. విజయ్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా కపిస్తుండటం..అలాగే టైం ట్రావెల్ తో వస్తుండటం వంటి అంశాలు ఉండటం వల్ల గ్రాఫిక్స్‌కి అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. కనుకే, హీరో విజయ్ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’ వాడి పాతికేళ్ల కుర్రాడిగా చూపించాల్సి రావడంతో..ఆ క్రియేటివ్ వర్క్ ని అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లోని స్టూడియో క్రియేటర్స్ కి ఈ విజువల్ ఎఫెక్ట్స్ పనులు అప్పగించినట్టు సమాచారం. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 5న వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి కారణంగా వరుస సెలవులు కలిసి వచ్చేలా G.O.A.T సినిమా రిలీజ్ సెట్ చేశారు మేకర్స్.దీంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.మరి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.