Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!

Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!

ఒక భూవివాదంలో జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr) హైకోర్టును ఆశ్రయించినట్లు ఉదయం నుండి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ ను 2003లో గీతాలక్ష్మి నుండి ఎన్టీఆర్ కొనుగోలు చేశాడని, అప్పటికే పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్టగేజ్ కింద గీతాలక్ష్మి లోన్స్ తీసుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఆ ఫ్లాట్ ను జూనియర్ ఎన్టీఆర్ కు అమ్మే సమయంలో లోన్ విషయాన్ని దాచిపెట్టారని, 2003 నుండి ప్లాట్ ఓనర్ గా తారక్ ఉండటంతో పలు బ్యాంకులతో వివాదం కొనసాగుతున్నదని ఆ వార్తల సారాంశం.

అయితే.. తాజాగా ఇదే విషయంపై ఎన్టీఆర్ టీం స్పందించింది... జూనియర్ ఎన్టీఆర్‌ గురించి ఈరోజు వినిపిస్తన్న వార్తలకు సమాధానంగా ఈ ప్రకటన చేస్తున్నామని  తెలిపారు. ప్రస్తుతం న్యూస్ లో ఏ స్థలం గురించి చర్చ నడుస్తుందో ఆ స్థలాన్ని 2013లోనే ఎన్టీఆర్‌ విక్రయించారని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. ఇకముందు ఎటువంటి రిపోర్టింగ్‌లో కూడా శ్రీ ఎన్టీఆర్ పేరును ఉపయోగించకుండా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాము.. అంటూ క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ టీమ్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.