హైదరాబాద్ లో 11 ఎకరాల భూమిని కబ్జా చెర నుంచి కాపాడింది హైడ్రా. కొండాపూర్, ప్రగతి నగర్ లో పార్కు, డంప్ యార్డు, శ్మశానవాటిక భూముల్లో ఆక్రమణలు తొలగించింది. హైడ్రా కాపాడిన మొత్తం భూముల విలువ రూ. 16 వందల 50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు హైడ్రా అధికారులు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మంగళవారం ( మార్చి 17 ) ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
కొండాపూర్ సెంట్రల్ పార్క్ కాలనీలో 2 ఎకరాల పార్కు స్థలాన్ని రక్షించింది హైడ్రా. పార్కు స్థలాన్ని ఆక్రమించి ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను తొలగించారు అధికారులు. పార్కు స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్, బోర్డుల ఏర్పాటు చేశారు. ప్రగతినగర్‌లో 9 ఎకరాల ప్రభుత్వ భూమి కాపాడింది హైడ్రా. 5 ఎకరాలు స్మశానవాటిక, 4 ఎకరాలు డంప్ యార్డుగా గుర్తించిన హైడ్రా మొత్తం భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
ప్రజావాణి ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. రెవెన్యూ, GHMC అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలించిన అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు.హైడ్రా చర్యలపై హర్షం వ్యక్తం చేశారు స్థానికులు.
