రొమాంటిక్‌ పాటకు భార్యతో కలిసి స్టెప్పులేసిన ముఖేష్ అంబానీ

రొమాంటిక్‌ పాటకు  భార్యతో కలిసి స్టెప్పులేసిన ముఖేష్ అంబానీ

గుజరాత్ లోని జామ్‌నగర్‌లో జరుగుతున్న తమ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో  ముఖేష్ అంబానీ,నీతా అంబానీ కలిసి ఓ రోమాంటిక్ పాటకు డ్యాన్స్‌ చేశారు.  బాలీవుడ్ లెజెండ్ రాజ్‌కపూర్ సినిమాలోని మెలోడీ సాంగ్,  టైమ్‌లెస్ క్లాసిక్ "ప్యార్ హువా ఇక్రార్ హువా" పాటకు ఇద్దరు స్టెప్పులు వేశారు .

అంబానీ సాంప్రదాయ కుర్తా- పైజామా ధరించగా..నీతా అంబానీ బంగారు చీరలో మెరిసిపోయింది. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ వీడియో కొన్ని గంటల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. అప్పటి నుండి లక్షల వ్యూస్‌ వస్తున్నాయి.  

అనంత్ అంబానీ, -రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక మార్చి 1 నుంచి మార్చి 03 వరకు మూడు రోజులు పాటు జరుగుతున్నాయి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ కోసం సినీ ప్రపంచంలోని చాలా మంది పెద్ద తారలు పాల్గొన్నారు.  ఈ వేడుకలో ఖాన్ త్రయం త్రిబుల్ ఆర్ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు.