వెహికల్స్ పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంపు

వెహికల్స్ పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంపు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో వెహికల్స్ పొల్యూషన్ టెస్టింగ్ ఫీజులను పెంచుతూ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో ఈ నెల 8న జారీ చేయగా..మీడియాకు రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి మంగళవారం విడుదల చేశారు. ఫీజులు పెంచాలని రవాణా శాఖ కమిషనర్ నుంచి వచ్చిన ప్రపోజల్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో ఆమె వివరించారు. ఖర్చులు, వేతనాలు పెరిగినందున చార్జీలు పెంచినట్లు తెలిపారు. 7 ఏళ్ల తరువాత ఫీజులు పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

పెరిగిన ఫీజులు

టు వీలర్ పెట్రోల్   రూ.50
పెట్రోల్ త్రీ వీలర్   రూ. 60
పెట్రోల్ ఫోర్ వీలర్స్  రూ. 75
డిజిల్ ఫోర్ వీలర్  రూ.100
ఇతర కేటగిరీల అన్ని వెహికల్స్ రూ.100