వ్యర్థాల నుంచి సంపద సృష్టించవచ్చు

వ్యర్థాల నుంచి సంపద సృష్టించవచ్చు

ఢిల్లీ–ముంబై ఎక్స్ ప్రెస్ హైవే మొదటి దశ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీ నుంచి ముంబైలోని జేఎన్ పీటీ వరకు మొదటి దశ పనులు ఈ ఏడాదిలోనే పూర్తిచేస్తామని చెప్పారు. దేశంలో సుమారు కోటి మంది ప్రజలు ఇంకా సైకిల్ రిక్షా నడుపుతున్నారనే విషయం తెలిసి తాను బాధపడ్డానని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు దేశంలో 400 స్టార్టప్ లు  ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ స్కూటర్లు,ఈ రిక్షాలు తయారు చేస్తున్నామన్నారు. ఆర్ డీ అండ్ ఎస్ హెచ్ లో ఆర్గానిక్ గార్డెన్ ను మంత్రి ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యర్థాల నుండి సంపదను సృష్టించవచ్చని  కేంద్ర మంత్రి అన్నారు.

గత8 ఏండ్లుగా నాగ్ పూర్ లోని మురుగునీటిని రీ సైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసి మహారాష్ట్ర ప్రభుత్వానికి విక్రయిస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. దీంతో తాము ఏటా రూ.300 కోట్లను సంపాదిస్తున్నామన్నారు.తాము చెరకు నుండి ఇథనాల్ వంటి ఆకుపచ్చ ఇంధనాలను తయారు చేస్తున్నామన్నారు. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నదని.. కాలుష్య రహితమైనదన్నారు. దీంతో ముడిచమురు దిగుమతిని తగ్గించడంలో సహాయపడుతుందన్నారు.