
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఆదివారం (మే 19)న ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి ఆప్ నేతలమంతా వస్తాం.. ధైర్యముంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తావో చేయించు అని సవాల్ విసిరారు. స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడినందుకు అతని సహాయకుడు బిభవ్ కుమార్‌ను అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేజ్రీవాల్. పీఎం మోదీ ప జైలు ఆట ఆడుతున్నారని అన్నారు.
మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలను జైలుకు పంపి ప్రధాని గేమ్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు.ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను కూడా బీజేపీ జైలుకు పంపుతుందని కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా నా అగ్రనేతలందరితో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తాం.. ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటావో చేసుకో అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు.