గ్యాస్ బ్లాక్ దందా.. సిలిండర్ 15 వందలు అంట.. ఏజెన్సీల దగ్గర క్యూ

గ్యాస్ బ్లాక్ దందా.. సిలిండర్ 15 వందలు అంట.. ఏజెన్సీల దగ్గర క్యూ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతాయని ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా ఇప్పటికే వంట గ్యాస్ ధరలను కేంద్రం పెంచేసింది. వంట గ్యాస్ సిలిండర్ ధరపై 60 రూపాయలు పెంచడంతో మధ్య తరగతి వర్గం కుదేలైంది.

యుద్ధం ఇలానే కొనసాగితే గ్యాస్ సిలిండర్ ధరలు అధికారికంగానే 15 వందల నుంచి 2 వేల వరకూ వెళ్లొచ్చనే అభిప్రాయం నెట్టింట వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు ఇదే అదనుగా గ్యాస్ సిలిండర్ల బ్లా్క్ మార్కెట్కు తెరలేపారు. ఒక్కో సిలిండర్ను బ్లాక్లో 15 వందల రూపాయల దాకా అమ్ముతున్నారు.

రంజాన్ మాసం కావడంతో ముస్లిం కుటుంబాలకు వంట గ్యాస్ అవసరం చాలా ఉంది. ఈ క్రమంలోనే.. యూపీలో ఒక ముస్లిం మహిళ మాట్లాడుతూ.. అదనంగా గ్యాస్ సిలిండర్ అవసరం ఏర్పడిందని.. అందుకే 15 వందలకు బ్లాక్లో సిలిండర్ కొనక తప్పలేదని చెప్పడం గమనార్హం. బ్లాక్లో ఇంతింత రేట్లకు గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్నారని తెలిసి కస్టమర్లు గ్యాస్ ఏజెన్సీల దగ్గర అదనపు సిలిండర్ల కోసం క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. సిటీల్లో, టౌన్స్లో ఈ యుద్ధం తర్వాత ఎల్పీజీ బుకింగ్స్ విపరీతంగా పెరిగాయి.

►ALSO READ | బెంగళూరులో దారుణం: బైక్ ఇవ్వలేదని లవర్, ఆమె తల్లిదండ్రులకి నిప్పంటించిన వ్యక్తి..

ఇండ్లలో వంట కోసం వాడే డొమెస్టిక్​ ఎల్‌పీజీ 14 కిలోల సిలిండర్ ధరను రూ.60 పెంచుతున్నట్టు​ కేంద్ర ఆయిల్​ మార్కెట్​కంపెనీలు గత శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాయి.

గడిచిన 11 నెలల్లో గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. గత ఏప్రిల్​లోనూ ధరలను పెంచాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913 కు చేరింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. వీరికి వచ్చే రూ.300 సబ్సిడీ పోగా సిలిండర్ ధర రూ.613 గా ఉంటుంది.