ప్రీ ప్రైమరీలో 23వేల అడ్మిషన్లు

ప్రీ ప్రైమరీలో 23వేల అడ్మిషన్లు
  • ఫస్ట్ క్లా సులో చేరిన వారి సంఖ్య 85 వేలు
  • జిల్లా లో నమోదైన 25 శాతం డ్రాపౌట్‍ రేటు
  • యూడైస్‍ ప్రకారమే టీచర్లు, నిధుల కేటాయింపు

హైదరాబాద్‍, వెలుగు : ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో స్టూడెంట్స్‌ డిటైల్స్ ‘యూ డైస్‌ 2017–18’(యునైటెడ్‌ డిస్ట్రిక్ట్ ఇన్ ఫర్మేషన్‍  సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్) డాటా బేస్‌ ఇటీవల విడుదలైంది. విద్యాశాఖ ఆధ్వర్యం లో చైల్డ్‌ ఇన్ వెబ్ సైట్ లోదీనికి సంబంధించిన ఫార్మాట్ లో 35 అంశాల వివరాలు నింపి టీచర్లు వెబ్ సైట్ లో అప్ లోడ్‌ చేస్తారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందులో పేర్కొన్న స్టూడెంట్స్‌ సంఖ్య ప్రకారం బడ్జెట్ లో విద్యారంగానికి నిధుల కేటాయింపు ఉంటుం ది. ఏటా స్కూళ్లలో తరగతి వారీగా విద్యార్థుల వివరాలు సేకరిస్తారు. టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలన్నా, ఉపాధ్యాయ, స్కూళ్ల హేతుబద్ధీకరణకు స్టూడెంట్‌ ‘యూ డైస్‌’నే విద్యాశాఖ ప్రామాణికంగా తీసుకుంటుంది. గత విద్యా సంవత్సరం వరకు డైస్‌ లెక్కల ఆధారంగా విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని, టీచర్ల పోస్టుల మంజూరుచేస్తారు. టీచర్ల హేతుబద్ధీకరణ, మధ్యాహ్నభోజన పథకం నిర్వహణ, పాఠ్య పుస్తకాలు,యూనిఫాం  పంపిణీకి కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.

ఫస్ట్ క్లాసులో కొత్తగా 85 వేల మంది

2017–18 అకడమిక్‍ ఇయర్ లో ప్రభుత్వ,ఎయిడెడ్‍ , అన్‌ ఎయిడెడ్‍ ప్రైవేట్‌ స్కూళ్లలో ప్రీప్రైమరీలో 23,234 మంది కొత్తగా జాయిన్‍ అయ్యారు. ఇందులో 12,062 బాలురు,11,172 బాలికలు ఉన్నారు . అలాగే ఫస్ట్ క్లాస్ లో 85,112 మంది అడ్మిషన్లు పొందగా, ఇందులో43,369 బాలురు, 41,743 బాలికలుఉన్నారు . 0–6 ఏండ్ల మధ్య 4,69,126(బాయ్స్), 2,45,127 (గర్ల్స్) కలిపి టోటల్ గా2,23,999 మంది స్టూ డెంట్స్‌ ఉన్నారు . జిల్లాజనాభాలో వీరు 11.90 శాతం. 6–10 ఏండ్లమధ్య 3,52,511 మంది, 11-13 ఏండ్ల మధ్య 2,18,524మంది, 14-15 ఏండ్ల మధ్య 1,41,756 మంది, 6 –15 ఏండ్ల మధ్య 7,12,791 మంది పిల్లలు ఉన్నారు . వీరందరు విద్యాహక్కు చట్టం ప్రకారం అర్హత కలిగిఉన్నారు .

ప్రైమరీలో 62 వేల మంది

జిల్లావ్యాప్తంగా 496 ప్రభుత్వ ప్రైమరీ, 226 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. అలాగే 9 ప్రభుత్వ అప్పర్‍ ప్రైమరీ, 1 తెలంగాణ వెల్ఫేర్‍, 35ఎయిడెడ్‍ ప్రైవేట్‍, 622 అన్‍ఎయిడెడ్ ప్రైవేట్‍,ఇతరులతో 9తో కలిపి మొత్తంగా 676 స్కూళ్లు నడుస్తున్నాయి. 3 సెం ట్రల్ హైస్కూల్స్, 180 స్టేట్‍ గవర్నమెం ట్స్, 114 ప్రైవేట్‍ ఎయిడెడ్‍,1180 ఆన్‍ఎయిడెడ్‍ ప్రైవేట్‍ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లు ఉన్నాయి. అన్ని విభాగాల్లో మేనేజ్ మెం ట్ల ఆధ్వర్యం లో నడుస్తున్న 2,959 స్కూళ్లు జిల్లాలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో 62,343, ఎయిడెడ్‍ ప్రైవేట్ లో 16,698, అన్‌ ఎయిడెడ్‍ ప్రైవేట్ లో 27, 575 మంది విద్యార్థులుప్రైమరీ విద్యను చదువుతున్నారు . అప్పర్‍ ప్రైమ-రీలో 1,02,921 మంది విద్యార్థులు ఉన్నారు.