హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఆఫీసు కోసం వెయ్యి మందికి జాబ్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఆఫీసు కోసం వెయ్యి మందికి జాబ్స్
  • చిన్న సిటీల కేండిడేట్లను తీసుకుంటాం
  • భారీగా క్లయింట్లను సంపాదించాం
  • ప్రకటించిన (24)7.ఏఐ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కస్టమర్ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌ అందించే అమెరికా కంపెనీ (24)7.ఏఐ తమ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఆఫీసు కోసం వచ్చే ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లోపు వెయ్యి మందికి జాబ్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తామని ప్రకటించింది. వీరితో కలుపుకుంటే ఇక్కడి ఉద్యోగుల సంఖ్య 3,500లకుచేరుకుంటుందని తెలిపింది. ఏపీ, తెలంగాణలోని వరంగల్‌‌‌‌‌‌‌‌, గుంటూరు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ వంటి చిన్న సిటీల నుంచి కూడా కేండిడేట్లను తీసుకుంటామని వెల్లడించింది. అర్హతలను బట్టి కస్టమర్‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌, సేల్స్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌, టెక్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ వంటి ఉద్యోగాలు ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తామని తెలిపింది. 
24(7).ఏఐ,, విదేశీ టెలికం, రిటైల్‌‌‌‌‌‌‌‌, బ్రాడ్‌‌‌‌‌‌‌‌ కాస్టింగ్‌‌‌‌‌‌‌‌, ట్రావెల్‌‌‌‌‌‌‌‌, హాస్పిటాలిటీ కంపెనీలకు కస్టమర్‌‌‌‌‌‌‌‌ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌, కస్టమర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ యాజ్‌‌‌‌‌‌‌‌ ఏ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్‌‌‌‌‌‌‌‌ డెలివరీ ఆపీసర్‌‌‌‌‌‌‌‌ అనిమేశ్‌‌‌‌‌‌‌‌ జైన్ మాట్లాడుతూ ‘‘మాకు ఇండియాలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, బెంగళూరులో ఆఫీసులు ఉన్నాయి. 7,500 మంది ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. విదేశాల్లోని ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ సంఖ్యను కలుపుకుంటే ఇది 17 వేలకు చేరుతుంది. వీరిలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 2,500 మంది, బెంగళూరులో ఐదు వేల మంది పనిచేస్తున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలోపు ఇండియాలోని ఎంప్లాయీస్ సంఖ్యను తొమ్మిది వేలకు పెంచుతాం. గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ 25 శాతం పెంచాం. ఈసారి ఇది 20 శాతం ఉంటుందని అనుకుంటున్నాం. మా కంపెనీలో ఉద్యోగుల రాజీనామాలు చాలా తక్కువగా ఉన్నాయి. హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌ను అమలు చేస్తున్నాం. మహిళా ఉద్యోగుల సంఖ్యను 33 శాతానికిపైగా పెంచాం. దాదాపు 15 శాతం మంది ఆఫీసుల నుంచి పనిచేస్తున్నారు’’ అని వివరించారు.