జర్మనీకి చెందిన హోం అప్లయెన్సెస్ మేకర్ బాష్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల సరికొత్త సిరీస్ను పరిచయం చేసింది. వీటిని పూర్తిగా ఇండియాలోనే తయారు చేశామని తెలిపింది. ఇవి దుస్తులను మన్నికగా ఉంచుతాయని, మరకల బెడద ఉండబోదని కంపెనీ ప్రకటించింది. ఇవి నీలం, వైన్, లిలక్, కోరల్ పింక్, టాన్జేరిన్ ఆరెంజ్, షాంపైన్ గోల్డ్ వంటి రంగులలో అందుబాటులో ఉంటాయి. పెద్ద మూత, ఇంటిగ్రేటెడ్ హ్యాండిల్స్, ఇంటిగ్రేటెడ్ స్క్రాబ్ జోన్, ఫ్లో-ఇన్-ఫ్రేమ్ ఫీచర్ వంటివి ఇందులోని ప్రత్యేకతలు.
