13 నుంచి కైట్ & స్వీట్ ఫెస్టివల్

13 నుంచి కైట్ & స్వీట్ ఫెస్టివల్
  • బ్రోచర్‌‌‌‌, వాల్‌‌‌‌ పోస్టర్‌‌‌‌ విడుదల చేసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌ , వెలుగు: సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం , టూరిజం శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌‌‌‌ పరేడ్‌ గ్రౌండ్స్‌‌‌‌లో ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు 5వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌‌‌‌ నిర్వహించనున్నారు. దీన్ని సక్సెస్‌‌‌‌ చేయాలని ఎక్సైజ్‌ , స్పోర్ట్ స్‌ , టూరిజం మంత్రి శ్రీనివాస్‌‌‌‌గౌడ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ పర్యాటక భవన్‌‌‌‌లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కో-ఆర్డినేషన్ మీటింగ్ సోమవారం జరిగింది.ఈ సమావేశంలో ఫెస్టివల్‌‌‌‌ బ్రోచర్‌ , వాల్‌‌‌‌ పోస్టర్‌ ను మంత్రి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌‌‌‌ను హైదరాబాద్ నగరం బ్రాండింగ్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నామన్నారు.

దాదాపు50 దేశాలకుపైగా అంతర్జా తీయ గుర్తింపు ఉన్న కైట్ ప్లేయర్స్ ఈ ఫెస్టివల్‌‌‌‌లో పాల్గొంటున్నారని తెలిపారు .దాదాపు 25 రాష్ట్రాల నుంచి వారి సంస్కృతి, కళలప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్ లు తెలిపారు. సమావేశంలో టూరిజం సెక్రటరీ బుర్రా వెం కటేశం, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, జీహెచ్‌ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, టూరిజం ఎండీ మనోహర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.