ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

 ఉత్తర‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. బ్రజ్‌ఘాట్ టోల్ ప్లాజా వ‌ద్ద కారు యాక్సిడెంట్ కు గురైంది. కారు అదుపుతప్పడంతో ట్రక్కును ఢీకొంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని మీరట్ హాస్పిటల్ కు తరలించారు.

అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు మీరట్ ఎస్పీ అభిషేక్ వర్మ తెలిపారు. ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్టు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.