200 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు

200 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అల్మోరా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 19 మంది ప్యాసింజర్లతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయ(సుమారు 200 మీటర్ల లోతు)లోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. బస్సు మంగళవారం అల్మోరాలోని ద్వారహత్ నుంచి నైనిటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బయలుదేరిందని పోలీసులు తెలిపారు. భికియాసైన్ ఏరియాలో శీలపాణి వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయిందన్నారు. 

ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. వంపులున్న రోడ్డును అంచనా వేయడంలో డ్రైవర్ విఫలమైనందువల్లే బస్సు లోయలో పడిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.