పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌గా బ్లాక్‌బస్టర్ అప్డేట్ రానుంది. డార్లింగ్ కెరియర్లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా ఫస్ట్ లుక్‌ను 2026 జనవరి 1న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం. జస్ట్ ఈ ఒక్క బజ్ తోనే సోషల్ మీడియా, సినీ వర్గాలు స్పిరిట్ వైపు లుక్కేసేలా చేశాయి.
అయితే, ఈ క్రేజీ టాక్కు కారణం లేకపోలేదు.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన ప్రివియస్ సెంటిమెంట్ను కంటిన్యూ చేయడానికి సన్నాహాలు మొదలెట్టేశాడట. ఎందుకంటే, సందీప్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సంచలనం "యానిమల్" ఫస్ట్ లుక్ కూడా న్యూ ఇయర్ రోజు నైట్ రిలీజ్ చేశాడు. సో, స్పిరిట్ ఫస్ట్ లుక్ సైతం 2026 న్యూ ఇయర్ స్పెషల్గా వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వైరల్గా మారింది.
సందీప్ రెడ్డి వంగా × ప్రభాస్ – ఫైర్ కాంబినేషన్:
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో తన స్టాంప్‌ను ఇండియన్ సినిమాలో బలంగా వేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈసారి ప్రభాస్‌తో కలిసి రా, రగ్డ్, రియలిస్టిక్ యాక్షన్ డ్రామాను తీసుకురాబోతున్నారు. వంగా స్టైల్ అంటేనే ఇంటెన్స్ ఎమోషన్స్, వైలెంట్ అండర్‌టోన్స్, క్యారెక్టర్ డెప్త్ – ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ‘స్పిరిట్’లో డబుల్ డోస్‌లో ఉండనున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.
పవర్‌ఫుల్ పోలీస్ అవతార్‌లో ప్రభాస్..
‘స్పిరిట్’లో ప్రభాస్ ఓ రా అండ్ రెబల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన పాత్రలన్నిటికంటే పూర్తిగా భిన్నంగా, రియల్, రఫ్, డార్క్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ గా ఈ మూవీ ఉండబోతుందట. ఫస్ట్ లుక్‌లోనే ప్రభాస్ లుక్ ఇండియన్ సినిమాల్లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
ఫస్ట్ లుక్ అంటే కేవలం పోస్టర్ కాదు..
అయితే, ఇక్కడ సినీ ఆడియన్స్ ఓ విషయం తప్పకుండా గమనించాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ఫస్ట్ లుక్ అంటే కేవలం ఒక పోస్టర్ మాత్రమే కాదు. క్యారెక్టర్ మైండ్‌సెట్, సినిమా టోన్, హీరో యాటిట్యూడ్, కథలోని డార్క్ థీమ్.. ఇలా అన్నీ ఒక్క ఫ్రేమ్‌లో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకే ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ ఒక షాక్ వేవ్ లాంటిదే అని భావించవచ్చు.
Also Read : సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుటుంబంలో విషాదం
ఇటీవలే స్పిరిట్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రభాస్‌తో పాటు పలువురు జూనియర్ ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌కు జోడీగా, 'యానిమల్' బ్లాక్‌బస్టర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి త్రిప్తి డిమ్రి నటిస్తోంది. ప్రభాస్-త్రిప్తిల ఫ్రెష్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. వీరితో పాటు, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ట్యూన్స్ సమకూరుస్తున్నారు. ఆయన సంగీతం 'యానిమల్'కు మేజర్ హైలైట్‌గా నిలిచింది. కాబట్టి, 'స్పిరిట్'లో కూడా అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలను ఉంటుంది.
