Mohanlal: సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుటుంబంలో విషాదం.. అభిమానులు & సినీ ప్రముఖుల సంతాపం

Mohanlal: సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుటుంబంలో విషాదం.. అభిమానులు & సినీ ప్రముఖుల సంతాపం

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం (2025 డిసెంబర్ 30) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియడంతో మోహన్ లాల్ అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ మరియు అభిమానులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

మోహన్ లాల్ సక్సెస్ వెనుక నిశ్శబ్ద శక్తిగా.. 

మోహన్ లాల్ తల్లి శాంతకుమారి 'దీర్ఘకాలిక అనారోగ్యం మరియు పక్షవాతంతో' పోరాడుతూ, కొచ్చిలోని తన ఇంట్లో ప్రత్యేక చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దివంగత ప్రభుత్వ అధికారి విశ్వనాథన్ నాయర్ భార్యగా పిలువబడే శాంతకుమారి, తన కుమారుడి చారిత్రాత్మక కెరీర్ వెనుక నిశ్శబ్ద శక్తిగా నిలిచారు.

"తన విజయానికి, మా అమ్మ శాంతకుమారి గారి శక్తి ఒక్కటే కారణమని" తరచుగా మోహన్ లాల్ కీర్తించే వారు. ముఖ్యంగా తన ఇటీవలి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మైలురాయిని ఆమెతో పంచుకుని ఎమోషనల్ అయ్యారు. ఇది వారి చివరి ఎమోషనల్ జ్ఞాపకాలలో ఒకటిగా నిలిచిపోతుంది.