న్యూఢిల్లీ, వెలుగు: అఖిల భారత మహిళా కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీలుగా తెలంగాణకు చెందిన అదిథ స్వప్న, ఈస్తర్ రాణిలకు అధిష్టానం అవకాశం కల్పించింది.ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
8 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 36 మంది కో ఆర్టినేటర్లతో కూడిన వివరాలను అందులో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. తక్షణమే ఈ నియామకాలు అమలులోకి వస్తాయని చెప్పారు.
